Chiranjeevi As God Father : గాయం తర్వాత హైదరాబాద్‌లో ‘గాడ్ ఫాదర్’ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అయిన చిరంజీవి.. రీసెంట్గా ‘గాడ్ ఫాదర్’ రెగ్యులర్ షూటింగ్ ఊటీలో మొదలైన సంగతి తెలిసిందే కదా. అక్కడ షూటింగ్లో భాగంగా చిరంజీవి చేతికి గాయమవ్వడంతో చిరంజీవి హుటాహుటినీ హైదరాబాద్ వచ్చేసారు. చిత్ర దర్శకుడు మోహన్ రాజా మాత్రం చిరు లేని సన్నివేశాలను ఆ షెడ్యూల్లో పిక్చరైజ్ చేసారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలతో మొదలైంది. ఈ షెడ్యూల్లో చిరు పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చేతికి గాయం తగ్గిపోవడంతో డాక్టర్ల సలహా మేరకు చిరు ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమాను వచ్చే యేడాది ద్వితీయార్థంలో జూలైలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4న ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఇప్పటికే ‘ఆచార్య’ ఫైనల్ కాపీ కూడా రెడీ అయింది. చిరంజీవి చేస్తున్న ’గాడ్ ఫాదర్’ విషయానికొస్తే.. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.
Balakrishna Unstoppable Talk Show : చిరంజీవి గురించి మోహన్ బాబుకు బాలకృష్ణ ఆసక్తికర ప్రశ్న..
‘గాడ్ ఫాదర్’ మూవీని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..
మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నాడట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ముందుగా విద్యాబాలన్‌ను చిరు చెల్లెలు పాత్ర కోసం అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఈ చిత్రంలో రమ్యకృష్ణ (Ramya Krishna) చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుసగా డిఫరెంట్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. బాహుబలిలో శివగామిగా అలరించింది. రీసెంట్గా ‘రిపబ్లిక్’, ‘రొమాంటిక్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు చిత్రాలున్నాయి. ‘లైగర్’, ’రంగమార్తాండ’, బంగార్రాజు సహా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇపుడు చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో రమ్యకృష్ణ .. చిరు చెల్లెలుగా కీలక పాత్రలో అలరించనుంది.
గతంలో రమ్యకృష్ణ .. చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘అల్లుడా మజాకా’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత చిరుకు చెల్లెలు పాత్రలో రమ్య అలరించనున్నట్టు సమాచారం.
గతంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. ఇపుడు చిరంజీవి హీరోగా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వస్తోన్న రెండో సినిమా.‘గాడ్ ఫాదర్’ సినిమాలో మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya film, Bhola Shankar Movie, Chiranjeevi, God Father Movie, Mohan Raja, Tollywood