Home /News /movies /

CHIRANJEEVI GETS EMOTIONAL IN SREEKARAM MOVIE PRE RELEASE AND SAYS SHARWANAND IS ANOTHER RAM CHARAN FOR HIM PK

Chiranjeevi - Sharwanand: శర్వానంద్ నాకు మరో రామ్ చరణ్.. ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్‌లో చిరంజీవి ఎమోషనల్..

శర్వానంద్ చిరంజీవి (Sharwanand Chiranjeevi)

శర్వానంద్ చిరంజీవి (Sharwanand Chiranjeevi)

Chiranjeevi - Sharwanand: తన అనుకున్న వాళ్లు ఎవరు పిలిచినా కూడా వెళ్లి వాళ్ల సినిమాలకు కావాల్సినంత బూస్టప్ ఇస్తుంటాడు చిరంజీవి. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కుర్ర హీరోల వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా వెళ్లి వాళ్లను ఆశీర్వదిస్తుంటాడు.

తన అనుకున్న వాళ్లు ఎవరు పిలిచినా కూడా వెళ్లి వాళ్ల సినిమాలకు కావాల్సినంత బూస్టప్ ఇస్తుంటాడు చిరంజీవి. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కుర్ర హీరోల వేడుకలకు చిరు ముఖ్య అతిథిగా వెళ్లి వాళ్లను ఆశీర్వదిస్తుంటాడు. అలాగే ఇప్పుడు శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా సందడి చేసాడు చిరు. ఖమ్మంలో జరిగిన ఈ వేడుకలో చిరు పాల్గొని.. తనదైన వ్యాఖ్యలతో అభిమానులతో జోష్ నింపాడు. సినిమా గురించి మాట్లాడుతూ ఈ రోజుల్లో వ్యవసాయం అనేది ఎవరూ పట్టించుకోవడం లేదని.. అది తప్పని శ్రీకారం సినిమాలో చూపిస్తున్నారంటూ చెప్పాడు. అద్భుతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని ఆయన ప్రశంసించారు. ఓ యాక్టర్ కొడుకు యాక్టర్.. డాక్టర్ కొడుకు డాక్టర్.. రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు కానీ రైతు కొడుకు మాత్రం రైతు కావడం లేదని చెప్పాడు మెగాస్టార్. ఇక హీరో శర్వానంద్ గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు చిరంజీవి. తన కొడుకు రామ్ చరణ్, శర్వా చిన్ననాటి స్నేహితులు అని.. తమ ఇంట్లోనే ఎక్కువగా శర్వానంద్ తిరిగేవాడని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తనకు నటనపై ఆసక్తి ఉందో లేదో తనకు తెలిసేది కాదని.. ఆ సమయంలో థమ్సప్ యాడ్‌లో తనతో పాటు నటించమని అడిగితే ఓకే చెప్పాడని చెప్పాడు చిరంజీవి.
Chiranjeevi,Chiranjeevi twitter,Chiranjeevi at sreekaram pre release,Chiranjeevi Sharwanand,Chiranjeevi Sharwanand relation,Chiranjeevi Sharwanand ram charan,chiranjeevi says Sharwanand is like ram charan for him,sreekaram movie release date,telugu cinema,శర్వానంద్,చిరంజీవి,చిరంజీవి శర్వానంద్,రామ్ చరణ్ శర్వానంద్ ఫ్రెండ్ షిప్,శర్వానంద్ మరో రామ్ చరణ్ అంటున్న చిరంజీవి
శర్వానంద్ చిరంజీవి (Sharwanand Chiranjeevi)

ఆ తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్‌లో అతిథి పాత్రలో మెరిసాడని.. అప్పుడే తనలో మంచి నటుడు ఉన్నాడనే విషయం అర్థమైందని చెప్పుకొచ్చాడు చిరంజీవి. అక్కడ్నుంచి అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడని శర్వానంద్‌ను ప్రశంసించాడు చిరు. అంతేకాదు.. తనకు రామ్ చరణ్ ఎంతో.. శర్వానంద్ కూడా అంతే అంటూ ఎమోషనల్ అయ్యాడు. తనకు శర్వానంద్ కూడా కొడుకు లాంటి వాడే అని చెప్పాడు. మార్చ్ 11న శివరాత్రి సందర్భంగా శ్రీకారం సినిమా విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Chiranjeevi, Sharwanand, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు