యువ హీరో మాటలకు కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..

యువ కార్తికేయ చిరంజీవిని ఉద్దేశించి చెప్పిన మాటలకి కంటనీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: January 19, 2020, 10:22 AM IST
యువ హీరో మాటలకు కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..
Twitter
  • Share this:
'RX100' సినిమాతో క్రేజీ హీరోగా మారాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతోనే తనలోని మెటల్‌ను బయటపెట్టాడు. ఇటు రొమాంటిక్ సీన్స్‌లో గాని లేదా అటు యాక్షన్ సీన్స్‌లలో కూడా ఇరగదీశాడు. 'RX100' సినిమా తర్వాత 'హిప్పీ' అనే సినిమాతో వచ్చిన కార్తికేయ ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత 'గుణ 369' అంటూ వచ్చి పరవాలేదనిపించాడు. తాజాగా ‘90ml’గా మరోమారు అలరించాడు. అది అలా ఉంటే ఓ స్టోజీ పైన ఉండి మాట్లాడుతూ.. కార్తికేయ చిరంజీవి చేత కంటనీరు పెట్టించారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జీ తెలుగు మూవీ అవార్డ్స్ 2020 వేడుక హైదరాబాద్‌‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ తన గ్రేసింగ్ డాన్సులతో, భావోద్వేగ మాటలతో చిరు ఉద్వేగానికి గురయ్యేలా చేశారు. హీరో కార్తికేయ చిరంజీవి అలనాటి హిట్ సాంగ్ ‘పదహారేళ్ళ వయసు పడి పడి లేచే మనసు…’ సాంగ్‌కి స్టేజ్ పరఫార్మెన్సు ఇచ్చారు. కార్తికేయ ఎనర్జిటిక్ స్టెప్స్ చూసి ముచ్చట పడ్డ చిరంజీవి, అనంతరం కార్తికేయ ఆయనని ఉద్దేశించి చెప్పిన మాటలకి కంటనీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు