చిరంజీవి పునాదిరాళ్లు దర్శకుడు కన్నుమూత..

మెగాస్టార్ చిరంజీవి ‘పునాదిరాళ్లు’ అనే చిత్రంతో చిత్రసీమకు పరిచయమైన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 15, 2020, 12:29 PM IST
చిరంజీవి పునాదిరాళ్లు దర్శకుడు కన్నుమూత..
Twitter
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ‘పునాదిరాళ్లు’ అనే చిత్రంతో చిత్రసీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. గుడిపాటి రాజ్ కుమార్‌కు కూడా ‘పునాదిరాళ్లు’ చిత్రం మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు ఐదు నంది అవార్డులు దక్కించుకుంది చిత్రబృందం. కాగా కొన్ని రోజుల నుండి గుడిపాటి రాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. దీనికి తోడు ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి రూ.41వేలు, ‘మనం సైతం’ తరపున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేలు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ రూ.50 వేలు, మరో దర్శకుడు మెహర్‌ రమేష్‌ రూ.10 వేలు, సినీయర్ డైరెక్టర్ కాశీవిశ్వనాథ్‌రూ.5 వేలు చొప్పున గుడిపాటి రాజ్ కుమార్‌కు ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల గుడిపాటి రాజ్ కుమార్ పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ బాధ తట్టుకోలేక ఆ తర్వాత భార్య చనిపోవడం రాజ్ కుమార్‌ను ఒంటరివాడిని చేసింది. ఒంటిరి బతుక్కు తోడు సంపాదన లేక అద్దె ఇంట్లో బాధలు పడుతూ వెళ్లదీస్తున్న దర్శకుడు ఈరోజు (శనివారం) ఉదయం మృతిచెందారు. గుడిపాటి రాజ్ కుమార్ సొంతూరు కృష్ణాజిల్లా ఉయ్యూరు.

 
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు