CHIRANJEEVI FEEL ABOUT K VISHWANATH KAMAL HAASAN SWATHI MUTHYAM MOVIE TA
చిరంజీవిని కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమా గురించి తెలుసా..
చిరంజీవి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చిరంజీవి ఓ సినిమా విషయంలో తెగ బాధపడ్డారట. వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్టీఆర్,కృష్ణల తర్వాత తెలుగులో నెంబర్ వన్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ సినీ సామ్రాజ్యాన్ని ఏలాడు. ఇక తొమ్మిదేళ్ల లాంగ్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చిరంజీవి కే.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా చూసి తెగ బాధపడ్డారట. ఇలాంటి సినిమా తానేందుకు చేయలేదని తెగ ఫీలయ్యాడట. ఆ విషయాన్ని ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు చెప్పుకొచ్చారు.
కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ (Facebook/Photo)
అప్పట్లో చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి సమయంలో చిరు ‘స్వాతిముత్యం’ సినిమా చేసారు. ఆ సినిమా చూసిన తర్వాత చిరుకు రెండు రోజులు నిద్రపట్టలేదు. ఇలా కూడా నటిస్తారా ? అనిపించింది. అన్ని అర్హతలు ఉన్న తనకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావడం లేదంటూ తీవ్రంగా కుమిలిపోయారట. ఆ తర్వాత కే.విశ్వనాథ్ దగ్గరకు వెళ్లి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘స్వయంకృషి’ సినిమా చేసారు. గతంలో వీళ్లిద్దరు ‘శుభలేఖ’ సినిమా చేసినా.. అప్పటికీ చిరుకు స్టార్డమ్ లేదు. చిరు స్టార్డమ్ అందుకున్న తర్వాత విశ్వనాథ్‌తో ‘స్వయంకృషి’ సినిమా చేసారు.
కే.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్వయంకృషి’ మూవీ (Facebook/Photos)
ఈ సినిమాలో చిరు చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించారు. అందుకోసం చిరు చెప్పులు బాగా కుట్టడం తెలిసిన వ్యక్తిని సెట్లో పెట్టుకుని ఆయన సూచనల మేరకు ఈ సినిమా షూటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో చిరంజీవి తొలిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చే నంది ఉత్తమనటుడు అవార్డు తొలిసారి అందుకోవడం విశేషం. ప్రస్తుతం చిరంజీవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేసాడు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.