ఇప్పుడు త్రిష చేసిన పని చూసి నిజంగానే ఇలాగే అడుగుతున్నారు అభిమానులు. చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాను వదిలేసి.. రవితేజతో సినిమా చేయడానికి ఓకే చెప్పడం వెనక లాజిక్ ఎవరికీ అర్థం కావడం లేదు. ఆచార్య నుంచి తప్పుకోడానికి కారణం మణిరత్నం సినిమాలో అవకాశం రావడమే.. అక్కడ డేట్స్ క్లాష్ అవుతాయని సినిమాను వదిలేసుకుందని చెప్పాడు చిరంజీవి. కానీ త్రిష చెప్పిన కారణం మాత్రం మరోలా ఉంది. కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో చెప్పింది త్రిష.
అయితే అక్కడ ఎవరితో ఆమెకు పడలేదనేది పక్కనబెడితే మణిరత్నం సినిమాలో ఆఫర్ వచ్చినందుకు మాత్రమే చిరు సినిమాను కాదన్నది అనేది అబద్ధమే అవుతుందిప్పుడు. ఎందుకంటే ఇదే సమయంలో రవితేజ సినిమాను ఓకే చేసింది త్రిష. కృష్ణ సినిమా తర్వాత మరోసారి ఈయనతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది చెన్నై చంద్రం. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు. తమిళనాట సూపర్ హిట్ అయిన ఓ సినిమాకు రీమేక్ ఇది. రాక్షసుడు రీమేక్ తర్వాత మరోసారి రీమేక్ సినిమాను నమ్ముకున్నాడు రమేష్ వర్మ.
వీర సినిమా తర్వాత మరోసారి ఈయనకు ఛాన్సిచ్చాడు మాస్ రాజా. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా బాగుంటుందని రవితేజ భావిస్తున్నాడు. దానికి ఈమె కూడా ఓకే చెప్పడంతో అంతా సెట్ అయిపోయింది. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం త్రిష కంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాజల్ అయితేనే ఆచార్యలో బాగుంటుందని అనుకుంటున్నారు. ఏదేమైనా కూడా చిరంజీవిని కాదని రవితేజకు ఓకే చెప్పడం ఏంటో మరి అంటూ త్రిషపై సెటైర్లు కూడా పడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Ravi Teja, Telugu Cinema, Tollywood, Trisha