తల్లి, తమ్ముళ్లు, చెల్లెల్లతో చిరంజీవి అపురూపమైన ఫ్యామిలీ ఫోటో..

తల్లి తోడబుట్టిన వాళ్లతో మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

ఉగాది సందర్భంగా చిరంజీవి ఎపుడైతే సోషల్ మీడియాలో అడుగుపెట్టాడో.. ప్రతి రోజు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా చిరంజీవి తన తల్లి, తోడబుట్టినవాళ్లతో ఉన్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

  • Share this:
    ఉగాది సందర్భంగా చిరంజీవి ఎపుడైతే సోషల్ మీడియాలో అడుగుపెట్టాడో.. ప్రతి రోజు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన పాత విషయాలను అభిమానులతో షేర్ పంచుకుంటున్నాు.  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ సందర్బంగా చిరంజీవి తన తోడ పుట్టినవాళ్లను మిస్ అవుతున్నట్టు తన తల్లి అంజనా దేవితో తన చెల్లెల్లు, తమ్ముళ్లు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఉంది. వీళ్లతో పాటు చిరంజీవి తమ్ముళ్లైన నాగబాబు, పవన్ కళ్యాణ్, చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి కూడా ఉన్నారు. వీరందరు ఓ ఆదివారం డైనింగ్ టేబుల్ దగ్గర ఓ సందర్భంలో లంచ్ చేస్తోన్న సమయంలో తీసినట్టు చిరంజీవి చెప్పారు.


    ఓ ఆదివారం చెల్లెల్లు, తమ్ముళ్లతో నేను అంటూ ఈ ఫోటోను పోస్ట్ చేశారు.  ఈ త్రో బ్యాక్ పిక్‌ను చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కరోనా వైరస్ సందర్భంగా చిరంజీవితో పాటు ఆయన చెల్లెల్లు, తమ్ముళ్లు ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమయ్యారు. ఇక చిరంజీవి..కరోనా నేపథ్యంలో పని లేకుండా పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. దీనికి బాలయ్య, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు సహా పలువురు హీరోలతో పాటు హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు విరివిగా విరాళాలు అందజేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: