Home /News /movies /

CHIRANJEEVI EMOTIONAL WORDS ABOUT HIS FATHER IN LAW PADMA SHREE ALLU RAMALINGAIAH 100TH BIRTH ANNIVERSARY TA

Chiranjeevi : అల్లు రామలింగయ్య నాకు మామ మాత్రమే కాదు... నాకు గురువు చిరంజీవి భావోద్వేగం..

అల్లు రామలింగయ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి (Twitter/Photo)

అల్లు రామలింగయ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి (Twitter/Photo)

Megastar Chiranjeevi - Allu Ramalingaiah : ఈ రోజు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మామ అల్లు రామలింగయ్య గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

    Megastar Chiranjeevi - Allu Ramalingaiah : ఈ రోజు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 100వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆయన మనవళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, బాబీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చిరు.. అల్లు రామలింగయ్యగారి  కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తాను మొదట అల్లు రామలింగయ్యను కలిసింది ఇక్కడే అన్నారు.

    అప్పటికీ తాను పెద్ద హీరో కాకపోయినా.. ఆయన తనపై నమ్మకంతో కూతురు సురేఖను తనకిచ్చి పెళ్లి చేసారన్నారు. మా మధ్య మామ అల్లుళ్ల బంధం కంటే గురుశిష్యుల సంబంధమే ఎక్కువ అన్నారు. ఆయన సినిమాల్లో విలక్షణ పాత్రలను ఎన్నో పోషించినా.. కమెడియన్‌గా మాత్రమే అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ నిజ జీవితంలో అల్లు రామలింగయ్య జీవితాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

    అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ తర్వాత చిరును సత్కరించిన అభిమానులు (Twitter/Photo)


    అంతేకాదు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, హోమియోపతి, ఇలా ఎన్నో గొప్ప విషయాల గురించి తనతో చర్చించే వారన్నారు. నటుడిగా ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ హోహియోపతి మీద ఉన్న ఆసక్తితో అందులో శిక్షణ కూడా తీసుకొని ఆర్‌ఎంపీ పట్టా సంపాదించారు. ఆయన నటుడే కాదు.. బహుముఖ ప్రజ్ఞాశాలన్నారు.

    Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..

    ఆయన నిరంతర విద్యార్థి. ఎపుడు ఏదో విషయం గురించి తెలుసుకోవాలనే ఉబలాటం ఆయనలో ఉండేది. ఒక చిన్న మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి స్వయంశక్తితో ఆయన నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. హాస్యనటుడిగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన నాకు ఎప్పటికీ స్పూర్తి ప్రధాత అన్నారు. నటుడిగా నా ప్రయాణం రాజమండ్రి గడ్డపైనే మొదలైందన్నారు.

    James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..

    ‘పునాదిరాళ్లు’ సినిమాతో పాటు నేను నటించిన చాలా సినిమాల షూటింగ్స్‌ ఇక్కడే జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా చిరు ప్రస్తావించారు. ఇక ఆయనతో తొలిసారి ‘మనఊరి పాండవులు’ సినిమాలో కలిసి నటించాను. అపుడే ఆయన తనను అల్లుడిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారన్నారు. ఈ వేడుకకు అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.

    Allu Ramalingaiah - Allu Arjun : తాత అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు మనవళ్లు..


    అల్లురామలింగయ్య విషయానికొస్తే..  ఈ పేరు తెలుగు తెరమీద హాస్యానికి చెదిరిపోని చిరునామ. ఆయన తెర మీద కనిపిస్తే చాలు.. నవ్వని ప్రేక్షకులుండరు. హావభావాలతోనే కాదు.. ఆయనన్ను చూస్తే చాలు ప్రేక్షకులు నవ్వుతారు. భారీ ఆకారం లేకపోయినా భీముడి పాత్ర పోషిస్తారు. హాస్యం, విలనిజం.. పాత్ర ఎలాంటిదైనా తనదైన స్టైయిల్ లో నవ్వించగల నవ్వుల రాజు అల్లు రామలింగయ్య. మూడు తరాల ప్రేక్షకులకు హాస్యాన్ని పంచి, నవ్వుల హరివిల్లును పూయించారు అల్లురామలింగయ్య. ఈయన తన అల్లుడు చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Acharya, Chiranjeevi, God father, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు