హోమ్ /వార్తలు /సినిమా /

SP Balu త్వరగా కోలుకొని ఆ గళం మళ్లీ విప్పాలి...చిరంజీవి ఆకాంక్ష

SP Balu త్వరగా కోలుకొని ఆ గళం మళ్లీ విప్పాలి...చిరంజీవి ఆకాంక్ష

చిరంజీవి కూడా ఇదే విషయం చెప్పాడు. తన సోదర సమానుడైన బాలు వీలైనంత త్వరగా కోలుకుంటాడని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలు.

చిరంజీవి కూడా ఇదే విషయం చెప్పాడు. తన సోదర సమానుడైన బాలు వీలైనంత త్వరగా కోలుకుంటాడని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలు.

SP Balasubramanyam Health | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆ గళం మళ్లీ విప్పాలని, కోటి రాగాలు తీయాలని చిరంజీవి(Megastar CHiranjeevi) ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం కోసం కోట్లాది మంది అభిమానులతో పాటు తాను కూడా భగవంతుడిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఇంకా చదవండి ...

  SP Balasubramanyam Health: చెన్నై ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రముక కథానాయకుడు చిరంజీవి(Megastar Chiranjeevi) ఆకాంక్షించారు. ఎస్పీబీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ వీడియోలో చిరంజీవి భావోద్వేగానికి గురైయ్యారు. ఎస్పీ బాలు కోలుకుంటున్నారని విని సంతోషిస్తున్నానని...తన సంతోషాన్ని అందరితో పంచుకునేందుకు ఇలా మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు. బాలుతో సినిమా అనుబంధమే కాకుండా...చెన్నైలో పక్కపక్క వీధుల్లో నివసించే రోజుల నుంచే ఎస్పీ బాలతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు. బాలు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు తనకు చెప్పారని...ఇది తనకెంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోందన్నారు.

  బాలు త్వరగా కోలుకుని ఆ గళం మళ్లీ విప్పాలని, కోటి రాగాలు తీయాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం కోసం కోట్లాది మంది అభిమానులతో పాటు తాను కూడా భగవంతుడిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Chiranjeevi, SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు