SP Balasubrahmanyam : బాలు గారు మళ్లీ పుడుతారు.. చిరంజీవి భావోద్వేగ ట్వీట్..

SP Balasubrahmanyam : సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని.. బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు చిరంజీవి.

news18-telugu
Updated: September 25, 2020, 3:50 PM IST
SP Balasubrahmanyam : బాలు గారు మళ్లీ పుడుతారు.. చిరంజీవి భావోద్వేగ ట్వీట్..
బాలు, చిరంజీవి Photo : Twitter
  • Share this:
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం‌ కరోనాతో గత నెల 5వ తేదిన చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆయన కరోనా పోరాడుతూ కాసేపటి క్రితమే మధ్యాహ్నం 01గం.04 నిమిషాలకు తుది శ్వాస విడిశారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని.. బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు చిరంజీవి. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను బాలు అందించారని... తన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని పేర్కోన్నారు చిరంజీవి. ఘంటశాలగారికి వారసుడిగా ఎవరొస్తారని సినీ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణంలో... బాలుగారు ఒక ధ్రువతారలా దూసుకొచ్చారని చిరంజీవి అన్నారు. తన మధురమైన గానంతో భాష, సంస్కృతుల సరిహద్దులను చెరిపేశారని.. దశాబ్దాల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారని కొనియాడారు.




బాలుగారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని, తన మరణం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారని అన్నారు. బాలు లేని లోటు తీర్చలేనిదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
Published by: Suresh Rachamalla
First published: September 25, 2020, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading