Home /News /movies /

CHIRANJEEVI EMOTION ABOUT UKRAINE TELUGU DOCTOR GIRIKUMAR PATIL TWEET GOES VIRAL SR

Chiranjeevi : ఉక్రెయిన్‌ తెలుగు డాక్టర్‌ విషయంలో చిరంజీవి భావోద్వేగం.. ట్వీట్ వైరల్..

చిరంజీవి (File/Photo)

చిరంజీవి (File/Photo)

Chiranjeevi : చిరంజీవి తాజాగా కొంత ఏమోషనల్ అవుతూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్, రష్యాల మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రష్యా దాడికి ఉక్రెయిన్‌లోని అక్కడి భవనాలు ధ్వంసమవుతున్నాయి.

ఇంకా చదవండి ...
  మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తూనే.. ఆయన మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. (Acharya) ఆచార్య ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక అది అలా ఉంటే.. చిరంజీవి తాజాగా కొంత ఏమోషనల్ అవుతూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్, రష్యాల మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రష్యా దాడికి ఉక్రెయిన్‌లోని అక్కడి భవనాలు ధ్వంసమవుతున్నాయి. దీంతో భారతీయులను ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వెనక్కి తీసుకొస్తోంది. అయితే ఇంకా కొంతమంది మాత్రం కొన్ని కారణాల వల్ల అక్కడే ఉంటున్నారు. అలాంటి వారిలో ఒకరు ఏపీకి చెందిన డాక్టర్ గిరికుమార్. ఏపీలోని తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరికుమార్ (Girikumar Patil) ఉక్రెయిన్‌లో డాక్టర్‌గా స్థిరపడి అక్కడే ఉంటున్నారు. ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ ఇండియాకు తాను రాలేనని పేర్కొన్నారు. దీనికి కారణం ఆయన ఉక్రెయిన్’లో ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఓ జాగ్వార్ ఓ పాంథర్. ఆయన  (Girikumar Patil) ఆ వీడియోలో మాట్లాడుతూ.. ఒకవేళా నేను ఇండియా వస్తే.. ఇవి తిండి లేకుండా చచ్చిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఇక్కడే ఉంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు చిరంజీవి తనకు ఆదర్శం అని.. చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమా చూసే.. అదే ప్రేరణగా ఈ జంతువులను పెంచుకుంటున్నట్టు తెలిపారు గిరికుమార్.

  ఇక ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు చలించిపోయారు. మూగ జీవాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అక్కడే ఉండిపోయిన గొప్పతనానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ఈ విషయం (Chiranjeevi) చిరంజీవికి తెలియడంతో ఆయన కూడా భావోద్వేగం చెందారు. ఈ నేపథ్యంలోనే ఏమోషన్‌ అవుతూ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మూగజీవాల కోసం అక్కడే ఉండాలనుకోవడం నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయమని.. ఈ ఛాలెంజింగ్ టైమ్‌లో మీరు అక్కడ క్షేమంగా, సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ అంటూ ట్వీటారు మెగాస్టార్. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  ఇక చిరంజీవి  (Chiranjeevi) నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ నటి శృతి హాసన్ (Shruti Haasan) నటించనుందని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. వరల్డ్ విమెన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది టీమ్. శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్' చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ గోపీచంద్ సినిమా‌లోను హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి మాస్‌ మసాలా కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'వాల్తేరు వాసు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగతీం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

  Keerthy Suresh : కీర్తి సురేష్ పేరెంట్స్‌ను చూశారా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

  ఇక కొరటాల శివ ఆచార్య విషయానికి వస్తే.. చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడారు. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తున్నారు. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మలయాళీ హిట్ సినిమా లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా (Tamannaah) చేస్తున్నారు.

  '
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chiranjeevi, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు