CHIRANJEEVI ELDER DAUTHER SUSHMITA KONIDELA SHOOT OUT AT ALERU TRAILER RELEASED TA
Sushmita Konidela: చిరంజీవి కూతురు నిర్మించిన ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’.. ట్రైలర్ విడుదల..
‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల (Youtube/Credit)
Sushmita Konidela Shoot out at Alair Trailer Released | మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గతంలో పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె నిర్మాణంలో తెరకెక్కిన ‘షూట్ ఔట్ ఎట్ ఆలేరు’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.
Sushmita Konidela Shoot out at Alair Trailer Released | మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గతంలో పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడడంతో ఆ మధ్య చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది. సుష్మిత తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ జీ5లో ఫామ్‌లో స్ట్రీమ్ కానుంది. 2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎన్కౌంటర్ నేపథ్యం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. జీ5లో 8 ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.
అది అలా ఉంటే.. ఈ షూట్ అవుట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్ పై వివాదం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ రాజకీయ పార్టీ ఈ సిరీస్‌ను తీవ్రంగా తప్పుబడుతోంది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్కోసం నిందితుల కుటుంబాల నుంచి ఈ వెబ్ సిరీస్ దర్శక నిర్మాతలు ఎలాంటీ అనుమతి కూడా తీసుకోలేదనే ఆరోఫణులున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, నందిని రాయ్‌తో పాటు నిహారిక కనిపించనున్నారు. ఈ వెబ్ సీరిస్‌కు ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సీరిస్‌లో చిరంజీవి గెస్ట్ పాత్రలో మెరవనున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.