Home /News /movies /

CHIRANJEEVI ELDER DAUGHTER SUSHMITA KONIDELA FIRST DEBUT MOVIE AS PRODUCER SRIDEVI SHOBHAN BABU MOVIE FIRST LOOK RELEASED TA

Sushmita Konidela : ’శ్రీదేవి శోభన్ బాబు’ మూవీతో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సినీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..

సుస్మిత కొణిదెల ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)

సుస్మిత కొణిదెల ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)

Sushmita Konidela : ’శ్రీదేవి శోభన్ బాబు’ మూవీతో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సినీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..

    Sushmita Konidela  - Sridevi Shobhan Babu | మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత  గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు  పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్య సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌‌ను నిర్మించింది. అందులో భాగంగా సుష్మిత తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ జీ5లో ఫామ్‌లో స్ట్రీమ్ అయ్యి పరవాలేదనిపించింది. ఇక ఆ వెబ్ సిరీస్‌ తర్వాత  ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

    ఇందులో భాగంగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ పేరుతో ఓ సినిమాను నిర్మించింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. అలనాటి జంట శోభన్ బాబు, శ్రీదేవి పేర్లతో ఈ సినిమా టైటిల్‌తో ఈ మూవీపై హైప్ క్రియేట్ చేసింది సుస్మిత.


    80లలో శోభన్ బాబు, శ్రీదేవి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి జోడికి ప్రేక్షకుల్లో అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అందుకే సుస్మిత ఇపుడు తాను నిర్మాత తెరకెక్కిస్తోన్న సినిమాకు ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఇందులో ‘ఏక్ మినీ కథ’ సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ హీరోగా నటించారు. హీరోయిన్‌గా జాను ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో గౌరీ ట్రెండీ లుక్‌లో కనిపిస్తే.. హీరో సంతోష్ శోభన్ ఫార్మల్ షర్ట్‌తో రఫ్ లుక్‌తో ఉన్నారు. మొత్తంగా క్యాచీ టైటిల్ ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రంతో నిర్మాత సుస్మిత కొణిదెల సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    ఇవి కూడా చదవండి.. 

    ’ఆహా’ కొత్త ఆఫీసులో సందడి చేసిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ..

    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    HBD Raadhika : హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ గురించి ఈ విషయాలు తెలుసా..


    Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..


    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Sridevi Shobhan Babu Movie, Sushmita Konidela, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు