మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోదరి చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా కూడా తమ్ముడు బాటలో నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఇప్పటికే నాగబాబు.. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో పలు చిత్రాలను చిరంజీవి, పవన్, రామ్ చరణ్‌లతో నిర్మించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన పేరున పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ‘సర్ధార్ గబ్బర్ సింగ్’తో పాటు ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక రామ్ చరణ్ కూడా హీరోగానే కాకుండా.. తమ ఇంటి పేరున కొణిెదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో చిరంజీవి హీరోగా ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలను నిర్మించాడు. తాజాగా రామ్ చరణ్ సోదరి సుస్మితా కూడా నిర్మాణ రంగంలో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. సుస్మిత విషయానికొస్తే.. ఈమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్. ఇపుడు సుస్మిత తాను ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు తన తండ్రి నటించిన సినిమాలకు బాగానే ఉపయోగపడుతోంది.
సుస్మిత తన తండ్రి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పాటు సైరా నరసింహారెడ్డి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ప్రస్తుతం ఈమె కొత్త కొత్త కథలతో వెబ్ సిరీస్‌లను తెరకెక్కించాడానికీ రెడీ అవుతోంది. అంతేకాదు తన నిర్మించే నిర్మాణ సంస్థకు గోల్డ్ బాక్స్ ఎంటరైన్మెంట్ అనే పేరును కూడా ఖరారు చేసింది. అంతేకాదు ఈ సంస్థలో భవిష్యత్తులో తమ కుటుంబంలోని హీరోలతో సినిమాలను నిర్మించాలనే ప్లాన్‌లో ఉంది. ఈమె నిర్మించే వెబ్ సిరీస్‌లు తన మేనమామ అల్లు అరవింద్‌కు సంబంధించిన ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసేలా వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha OTT Platform, Allu aravind, Chiranjeevi, Ram Charan, Sushmita Konidela, Tollywood