CHIRANJEEVI DUPE INTERESTING FACTS ABOUT MEGASTAR CHIRANJEEVI DUPE FOR PAST WHO PLAY 30 YEARS HERE ARE INTERESTING DETAILS TA
Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవికి గత 30 యేళ్లుగా డూప్‌గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)
Megastar Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో రియల్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించి అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా కొలువైన సంగతి తెలిసిందే కదా. ఇక చిరంజీవికి గత 30 యేళ్లుగా ఈయనే డూప్‌గా వ్యవహరిస్తున్నారు.
Megastar Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో రియల్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించి అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా కొలువైన సంగతి తెలిసిందే కదా. ఎపుడు రియల్ ఫైట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే చేసే హీరోలు అప్పుడప్పుడు డూప్‌లతో తమ సన్నివేశాలను చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని రిస్కీ షాట్‌లను చేసేందుకు చాలా మంది హీరోలు సాహసించరు. అలాంటి సమయంలో డూప్‌లతో ఆ సన్నివేశాలను కానిచ్చేస్తారు దర్శకనిర్మాతలు. అయితే అంత రిస్కీ సీన్లు చేసినా ఇదివరకు వారి గురించి పెద్దగా ఎవ్వరికీ తెలిసేది కాదు. అయితే సోషల్ మీడియా విరివిగా వాడుతున్న ఈ కాలంలో డూప్‌ల గురించి కూడా బాగా తెలుస్తోంది. ఇక కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల నిర్వాహకులు వారిని లైమ్‌టైమ్‌లోకి తీసుకొస్తుండంతో హీరోల డూప్‌లకు ఇప్పుడు ఆదరణ బాగా లభిస్తోంది.
ఇదిలా ఉంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి డూప్‌గా చేసేది ఎవరో తెలుసా..? ఆయన పేరు.. ఏ ఊరో తెలుసా..? ఈ విషయాలన్నీ ఇటీవల ఓ షోలో రివీల్ అయ్యాయి. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కొత్త షోను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాలకు వెళ్లనున్న ఈ షో నిర్వాహకులు అక్కడి టాలెంట్‌ని బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ ఈ షోలోకి చిరంజీవి డూమ్ వచ్చారు. ఆయన పేరు ప్రేమ్ కుమార్.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారు. అంతేకాదు ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయనకు ఒక కంపెనీ ఉంది. ఇక షోలో వచ్చిన ఆయన.. రికార్డింగ్ డ్యాన్సర్లంటే చాలా చిన్న చూపు ఉన్న విషయం చెప్పుకొచ్చారు. వారికి ఆదరణ సరిగా లభించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ లాంటి వాళ్లకు ఒక ఫ్లాట్‌ఫామ్‌ని ఇస్తోన్న ఈటీవీ వారికి కృతఙ్ఞతలని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. ఏజ్ 60 క్రాస్ అయినా.. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. అదేం జోరు సామీ అంటూ పండగ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా మరో సినిమాను అనౌన్స్ చేసారు చిరంజీవి. ఒకేసారి అరడజన్ సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్. రీసెంట్‌గా చిరు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసారు చిరంజీవి. చాలా రోజుల కిందే చిరును కలిసి కథ చెప్పాడు వెంకీ. అప్పుడే ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు.
ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఈయన బిజీగా ఉన్నాడిప్పుడు. దీని తర్వాత కూడా వరసగా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు దానయ్య. పైగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ నిర్మాత. ఛలో సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ కుడుముల.. భీష్మ సినిమాతో మరో విజయం అందుకున్న సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.