నీవెవరు నాకు సలహాలు ఇవ్వడానికి.. చిరంజీవికి కమల్ హాసన్ కౌంటర్..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సూపర్  స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌కు రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కాబట్టి రాజకీయాలను పక్కనపెట్టి సినిమాలు చేసుకుంటే బెటర్ అంటూ సలహా ఇచ్చాడు. దానికి కమల్ హాసన్ చిరుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

news18-telugu
Updated: September 29, 2019, 7:17 PM IST
నీవెవరు నాకు సలహాలు ఇవ్వడానికి.. చిరంజీవికి కమల్ హాసన్ కౌంటర్..
కమల్ హాసన్,చిరంజీవి (File Photos)
  • Share this:
తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సూపర్  స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌కు రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కాబట్టి రాజకీయాలను పక్కనపెట్టి సినిమాలు చేసుకుంటే బెటర్. నేను, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజకీయాల్లో ఎంతో పోగుట్టుకున్నాం.  అప్పట్లో నేను కూడా పాలకొల్లు నుంచి ఓడిపోయాను. తాజాగా తన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుత రాజకీయాలన్నీ ధన, కుల ప్రవాహంలో ఉండటంతో ఎంత సూపర్ స్టార్స్ వచ్చినా ఇక్కడ  తట్టుకుని నిలబడటం కష్టమని సలహా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi sweet warning to Tamil Superstars Rajinikanth and Kamal Haasan on Political career pk చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. పదేళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న అన్నయ్య.. ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో విజృంభిస్తున్నాడు. సైరా సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న చిరు.. pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan janasena party,chiranjeevi,chiranjeevi rajinikanth,chiranjeevi kamal haasan,chiranjeevi sye raa,chiranjeevi sye raa movie,chiranjeevi politics,chiranjeevi prajarajyam,rajinikanth politics,kamal haasan politics,చిరంజీవి,చిరంజీవి కమల్ హాసన్,చిరంజీవి రజినీకాంత్,చిరంజీవి సైరా,చిరంజీవి రాజకీయాలు,తెలుగు సినిమా
చిరంజీవి రజినీకాంత్ కమల్ హాసన్ (Source: Twitter)


ఈ విషయమై తాజాగా కమల్ హాసన్ చిరంజీవికి గట్టి కౌంటర్ ఇచ్చారు. నాకు చిరంజీవి మంచి మిత్రుడు. ఆయన సలహాలు నేను పాటించాలనుకోవడం లేదు. నేను రాజకీయాల్లో వచ్చింది వ్యవస్థను బాగు చేయడం కోసమే అంటూ సమాధాన మిచ్చాడు. భవిష్యత్తులో రాజకీయాల గురించి నాకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని చిరంజీవికి కాస్త గట్టిగానే సమాధాన మిచ్చాడు. పాలిటిక్స్ అంటేనే ఇలా ఉంటాయని నాకు తెలుసు. అందులో మార్పు కోసమే నేను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానన్నారు. ఈ విషయమై చిరంజీవి ఫ్యాన్స్ కమల్ హాసన్ పై గుర్రుగా ఉన్నారు. కానీ కమల్ హాసన్ చిరుకు గట్టి కౌంటర్ ఇచ్చినా...రజినీకాంత్ మాత్రం చిరంజీవి చెప్పిన సలహాపై మౌనంగానే ఉన్నారు. ప్రస్తుతం కమల్ హాసన్.. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ తమిళ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. గతంలో వీళ్లిద్దరు ‘ఇది కథ కాదు’ అనే సినిమాలో కలిసి నటించారు. 
Published by: Kiran Kumar Thanjavur
First published: September 29, 2019, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading