HOME »NEWS »MOVIE »chiranjeevi do mistake by mistakes here are the details ta

ఇంతకీ చిరంజీవికి ఏమైంది.. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు..

ఇంతకీ చిరంజీవికి ఏమైంది.. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు..
చిరంజీవి (Chiranjeevi Dasari)

ఇంతకీ చిరంజీవికి ఏమైంది ఎందుకిలా మాట్లాడుతున్నాడు అని ఆయన అభిమానులతో పాటు సన్నిహితులు ఇపుడు సన్నాయి  నొక్కులు నొక్కుతున్నారు.

  • Share this:
    ఇంతకీ చిరంజీవికి ఏమైంది ఎందుకిలా మాట్లాడుతున్నాడు అని ఆయన అభిమానులతో పాటు సన్నిహితులు ఇపుడు సన్నాయి  నొక్కులు నొక్కుతున్నారు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే తీసుకోవడం కష్టం అంటుంటారు. ఇపుడు చిరంజీవి కూడా ఎక్కడ సీక్రెట్ మెయింటెన్ చేయాలో తెలియక తికమక పడుతున్నారంటూ ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న బ్రహ్మాజీ కొడుకు సంజయ్ హీరోగా నటించిన ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి తన సినిమా గురించి అనుకోకుండా  నోరుజారాడు మెగాస్టార్ చిరంజీవి. ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అసలు ఏంటి ఈ చిత్ర టైటిల్ అంటూ ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. కొందరు ‘గోవింద ఆచార్య’ అంటే.. మరికొందరు ‘ఆచార్య’ అంటూ ఏవేవో కథలు అయితే చెబుతున్నారు. కానీ ఇప్పుడు అందరి అనుమానాలకు క్లారిటీ ఇస్తూ చిరంజీవి తన సినిమా టైటిల్ తానే చెప్పేసాడు. నోరుజారి అనుకోకుండా తన సినిమా పేరు ‘ఆచార్య’  బయటికి చెప్పేసాడు చిరంజీవి.

    చిరంజీవి కొరటాల సినిమా లుక్ లీక్ (chiranjeevi new movie title acharya)
    చిరంజీవి కొరటాల సినిమా లుక్ లీక్ (chiranjeevi new movie title acharya)




    అంతకు ముందు చిరంజీవి.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలో ‘రంగస్థలం’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో అన్న ఆది పినిశెట్టి చనిపోయే సీన్ చూస్తుంటే.. ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది అంటూ కామెంట్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి పాత తరానికి చెందిన హీరో కాబట్టి.. ఏదో తెలియక ఇలా మాట్లాడని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఏజ్‌తో వచ్చిన చాదస్థం కూడా కావచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఎంతో అట్టహాసంగా చిరంజీవి కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయాలనుకున్న రామ్ చరణ్, కొరటాల శివ ఆశలపై చిరంజీవి నీళ్లు చల్లాడని వ్యాఖ్యానిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:March 02, 2020, 17:48 IST