CHIRANJEEVI DAUGHTERS SUSHMITA SREEJA KONIDELA CELEBRATED MAHA SHIVARATRI IN STYLE WITH TRADITIONAL LOOK PK
Chiranjeevi Daughters: శివరాత్రి పర్వదినాన చీరలో మెరిసిన చిరంజీవి తనయలు శ్రీజ, సుష్మిత..
చిరంజీవి కూతుళ్ళు (Chiranjeevi daughters)
Chiranjeevi Daughters: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రతీ పండగ కూడా చాలా అద్భుతంగా, ఘనంగా జరుగుతుంది. అక్కడ ఇంట్లో అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా చిరు ఇంటికి వస్తుంటారు. అక్కడే అందరితో కలిసి పండగను పండగలా..
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రతీ పండగ కూడా చాలా అద్భుతంగా, ఘనంగా జరుగుతుంది. అక్కడ ఇంట్లో అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా చిరు ఇంటికి వస్తుంటారు. అక్కడే అందరితో కలిసి పండగను పండగలా జరుపుకుంటారు మెగా ఫ్యామిలీ. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. శివరాత్రి పండగను కూడా అంతే ఘనంగా జరుపుకున్నారు మెగా కుటుంబ సభ్యులు. తాజాగా మెగా డాటర్స్ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీర కట్టుకుని.. షేడ్స్ పెట్టుకుని సుష్మిత, శ్రీజ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో తమ వంతు బాధ్యత నిర్వరిస్తున్నారు. ఇప్పటికే చిరు పెద్ద కూతురు సుష్మిత క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తుంది. తన తండ్రి సినిమాలతో పాటు తమ్ముడు రామ్ చరణ్ సినిమాలకు కూడా పని చేస్తుంది. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. బయటి నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా కేవలం ఇంటి సినిమాలకు మాత్రమే పని చేస్తుంది సుష్మిత. అలాగే ఈ మధ్యే వెబ్ సిరీస్ నిర్మాణంలోకి కూడా వచ్చింది. షూటౌట్ ఎలా ఆలేరుతో తొలిసారి వెబ్ సిరీస్ నిర్మించింది. మరోవైపు చిన్నకూతురు శ్రీజ కూడా నిర్మాతగా తొలి అడుగులు వేసేందుకు సిద్ధమవుతుంది. సినిమాల సంగతి పక్కనబెడితే రియల్ లైఫ్‌లో ఈ అక్కాచెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. తాజాగా ఈ మెగా డాటర్స్ ఇద్దరూ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయ బద్ధంగా రెడీ అయ్యారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్న తర్వాత ఇలాంటి లుక్ పోస్ట్ చేసారు. చీరలో ఎంతో సాంప్రదాయ బద్ధంగా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చుట్టేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.