రామ్ చరణ్‌ను ఫాలో అవుతోన్న సుష్మిత.. ఆల్ ది బెస్ట్ చెప్పిన సురేఖ..

కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం థియేటర్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో ఓటీటీల హవా నడుస్తోంది.

news18-telugu
Updated: July 11, 2020, 1:30 PM IST
రామ్ చరణ్‌ను ఫాలో అవుతోన్న సుష్మిత.. ఆల్ ది బెస్ట్ చెప్పిన సురేఖ..
చిరంజీవితో సుష్మిత Photo : Twitter
  • Share this:
కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం థియేటర్స్ అన్ని బంద్ అయ్యాయి. దీంతో ఓటీటీల హవా నడుస్తోంది. విడుదల కావాల్సిన చాలా సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. ఇటీవల తెలుగులో డైరెక్ట్‌గా విడుదలైన క‌ృష్ణ అండ్ హిజ్ లీలా, బానుమతి రామకృష్ణ మంచి ఆదరణ పొందాయి. దీనికి తోడు మరోవైపు వెబ్ సిరీస్‌లకు మంచి ఊపు వచ్చింది. సినిమా హాల్స్ మూసివేయడంతో జనాలు స్ట్రీమింగ్ సంస్థలపై ఆధారపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఆర్జీవి వరల్డ్ అనే ఓ యాప్‌ను ఓపెన్ చేసి అక్కేడే తన సినిమాలను విడుదల చేస్తూ.. తలకు ఒక్కంటికి 100 నుండి 200 రూపాయల వరకు వసూలు చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నాడు. తాజాగా ఈ వ్యాపారంలోకి చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత వచ్చారు. ఆమె ఓ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేయనున్నారు. గత కొద్ది రోజులుగా దీనిపై వార్తలు వస్తుండగా…నేటితో స్పష్టత వచ్చింది. సుస్మిత నిర్మాతగా నేడు ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది.

దీనికి సంబందిచిన పూజా కార్యక్రమానికిక సుస్మిత తల్లి, సురేఖ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. ఇక సుష్మిత గతంలో ప్రోడ్యూస్ చేయలేదు కానీ.. కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. తన తండ్రి చిరంజీవి.. జై చిరంజీవకు, చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150, సైరా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఇక ఇప్పటికే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్స్‌తో సినిమాలను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: July 11, 2020, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading