హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi: చిరంజీవి కూతురు చేసిన పని చూసి.. షాక్ అవుతున్న మెగా ఫ్యాన్స్

Chiranjeevi: చిరంజీవి కూతురు చేసిన పని చూసి.. షాక్ అవుతున్న మెగా ఫ్యాన్స్

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల

చిరంజీవి పెద్దకూతురుగానే కాకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సుస్మిత కొణిదెల, మెగాస్టార్ సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేసింది.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పెద్ద కూతురు సుస్మిత కొణిదెల(Sushmita Konidela) గురించి తెలియని వారుండరు. పెద్దింటి కూతురు అయినా.. నలుగురిలోకి వచ్చినప్పుడు.. పద్ధతిగా ఉంటుంది సుస్మిత. ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా.. సుస్మిత... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంట్లో ఏ పండగలు, పార్టీలు జరిగినా సుస్మిత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. అయితే తాజాగా సుస్మిత(Sushmita) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓవీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ సుస్మిత ఏం చేసిందనే కదా మీ డౌట్?

ఇంట్లో ఉన్న సుస్మిత చక్కగా చీర కట్టుకొని కూర్చొన్నారు. వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్ శారీలో ఆమె ఎంతో ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు. అంతేకాదు .. ఆమె చీర కట్టులోఓ టేబుల్ వద్ద కూర్చొని చక్కగా మల్లెపూలు ముందేసుకొని చేతి మాల కడుతున్నారు. ఈ వీడియో పోస్టు చేసిన సుస్మిత.. ‘సమ్మర్ ఈవినింగ్ వీడియో బై మై లిటిల్ మంకీ’ అని కామెంట్ పెట్టి పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అచ్చం అమ్మాలాగానే.. ఓ నెటిజన్ అంటే.. మరో నెటిజన్ మల్టీ ట్యాలెంటెడ్ వుమెన్ .. సూపర్ అక్కా అంటూ.. కామెంట్ చేశారు. మీకు పూలు కట్టడం కూడా వచ్చా అని మరో నెటిజన్ ప్రశ్నిస్తూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి సుస్మిత మల్లెపూలతో చేతి మాల మాత్రం చాలా అందంగా కడుతున్నారు.

View this post on Instagram


A post shared by Sushmita (@sushmitakonidela)మరోవైపు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూనే.. అటు సినిమాల్లో కూడా బిజీగా మారారు సుస్మిత కొణిదెల. ‘శ్రీదేవి శోభన్ బాబు’(Sridevi Shobhan Babu) పేరుతో ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాను ఫేమ్ గౌరీ కిషన్ నటించింది. ఈ సినిమాకు సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుస్మిత గతంలో ఆయన నటించిన ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్య సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌‌ను నిర్మించారు. సుష్మిత తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు .

ఇప్పుడు శ్రీదేవి శోభన్ బాబు సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ ను విడుదల చేశారు. సుస్మిత త్వరలో తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్, తమ్ముడు రామ్ చరణ్‌లతో పాటు మిగతా మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు మెగా డాటర్ సుస్మిత.

First published:

Tags: Chiranjeevi, Megastar Chiranjeevi, Sushmita Konidela

ఉత్తమ కథలు