CHIRANJEEVI DAUGHTER SUSHMITA KONIDELA STOPPED HER WEB SERIES SHOOT DUE TO COVID 19 PK
చిరంజీవి పెద్ద కూతురు సుష్మితకు షాక్ ఇచ్చిన కరోనా..
చిరంజీవి సుష్మిత కొణిదెల (chiranjeevi sushmita)
Chiranjeevi daughter Sushmita: కరోనా వైరస్ కారణంగా ఇండస్ట్రీ స్థంభించిపోయింది. ఎవర్నీ తమ పని తమను చేసుకోనివ్వడం లేదు ఇది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని..
కరోనా వైరస్ కారణంగా ఇండస్ట్రీ స్థంభించిపోయింది. ఎవర్నీ తమ పని తమను చేసుకోనివ్వడం లేదు ఇది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని అయితే పూర్తిగా మూగబోయేలా చేసింది కరోనా. అక్కడక్కడా కొందరు ధైర్యంగా కరోనాను దాటి మరీ బయటికి వచ్చి షూటింగ్ చేయాలని చూసినా కూడా భయపెడుతూనే ఉంది ఈ మహమ్మారి. ఇందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి పెద్ద కూతురు కూడా ఇదే చేస్తుంది. ఈమె ఈ మధ్యే 'గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్' అనే నిర్మాణ సంస్థను స్థాపించింది.
అందులోనే వెబ్ సిరీస్‌లు నిర్మించాలని చూస్తుంది సుష్మిత. త్వరలోనే చిన్న సినిమాలు కూడా నిర్మించాలని చూస్తుంది. దీనికి తండ్రి నుంచి కూడా కావాల్సినంత సపోర్ట్ ఉంది. ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్‌కు కూడా శ్రీకారం చుట్టింది సుష్మిత. తల్లి సురేఖ కొణిదెల ఆశీర్వాదంతోనే ఇది మొదలైంది. అప్పటి నుంచి షూటింగ్ కూడా మొదలు పెట్టింది సుష్మిత. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి షూటింగ్ ఆపేసారు.. కాదు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.
కారణం కరోనా వైరస్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాను తట్టుకుని షూట్ చేయడం కష్టమే అని తెలిసి తన వెబ్ సిరీస్ షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది చిరంజీవి కూతురు. తన టీమ్‌లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. వెంటనే అతనితో క్లోజ్‌గా ఉన్న వాళ్లందరికీ పరీక్షలు చేయించింది ఈమె. దాంతో పాటు అందర్నీ 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సుస్మిత తెలుస్తుంది.
ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ షూట్ చేసారనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అటాక్ కావడంతో కొన్ని రోజులు వీటన్నింటికీ దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయింది మెగా డాటర్. ఇందులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.