Home /News /movies /

CHIRANJEEVI DAUGHTER SUSHMITA KONIDELA SHARED UNSEEN PICS OF NIHARIKA BIRTHDAY PK

Niharika Sushmita Konidela: నిహారిక బర్త్ డే అన్‌సీన్ పిక్స్ షేర్ చేసిన సుష్మిత కొణిదెల..

నిహారిక పుట్టిన రోజు (Niharika Birthday)

నిహారిక పుట్టిన రోజు (Niharika Birthday)

Niharika Sushmita Konidela: పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజు కావడంతో నిహారిక ఆనందంలో తేలిపోతుంది. తన జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తితో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకుంది నిహారిక. భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు మెగా కుటుంబం అంతా..

పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజు కావడంతో నిహారిక ఆనందంలో తేలిపోతుంది. తన జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తితో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకుంది నిహారిక. భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు మెగా కుటుంబం అంతా కలిసి కొత్త పెళ్లి కూతురు బర్త్ డేను చాలా ఘనంగా జరిపారు. అందులో చిరంజీవి పిల్లలతో పాటు మిగిలిన వాళ్లు కూడా ఉన్నారు. భర్త చైతన్య.. అక్కలు సుష్మిత, శ్రీజ సమక్షంలో నిహారిక జన్మదిన వేడుకలు జరిగాయి. వీటిని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సుష్మిత కొణిదెల. తన డార్లింగ్ చెల్లికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో నిహారిక చైతన్యతో పాటు శ్రీజ దంపతులు.. సుష్మిత దంపతులు కూడా ఉన్నారు. అలాగే మెగా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ ఫోటోలను షేర్ చేసిన నిమిషం నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక బర్త్ డే అన్‌సీన్ పిక్స్ చూసి అభిమానులు కూడా లైక్స్ కొడుతున్నారు.. కామెంట్స్ పెడుతున్నారు. కొత్త పెళ్లికూతురుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ చెప్తున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 9న ఉదయపూర్‌లో నిహారిక పెళ్లి జరిగింది.

పెళ్లైన వారం రోజులకే ఇప్పుడు పుట్టిన రోజు జరుపుకుంటుంది నిహా. త్వరలోనే ఈ జోడీ హనీమూన్ వెళ్లనున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసమే ఇప్పటి వరకు అలాంటిది ప్లాన్ చేయలేదని తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Niharika konidela, Sushmita Konidela, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు