క్రిస్మ‌స్ కానుక‌.. మ‌రోసారి తాత అయిన మెగాస్టార్..

చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన మరోసారి తాత అయ్యాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు పండంటి ఆడబిడ్డ జ‌న్మ‌నిచ్చింది. క్రిస్మస్ శుభదినాన తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ చిరంజీవి సంబరపడిపోతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 25, 2018, 6:39 PM IST
క్రిస్మ‌స్ కానుక‌.. మ‌రోసారి తాత అయిన మెగాస్టార్..
కూతురు, అల్లుడుతో చిరంజీవి
  • Share this:
చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన మరోసారి తాత అయ్యాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు పండంటి ఆడబిడ్డ జ‌న్మ‌నిచ్చింది. క్రిస్మస్ శుభదినాన తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ చిరంజీవి సంబరపడిపోతున్నారు. పండ‌గ సంతోషాన్ని మ‌రింత పెంచుతూ వ‌చ్చిన పాపాయిని చూసి మురిసిపోతున్నారు మెగా కుటుంబం. ఈ శుభవార్తను శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. రెండేళ్ల కింద కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ వివాహం జరిగింది. దానికి ముందు శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. రెండు సంవత్సరాలు క‌లిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకుంది.

Chiranjeevi Daughter Sreeja, Kalyan Dev Belssed with Baby Girl.. చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన మరోసారి తాత అయ్యాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు పండంటి ఆడబిడ్డ జ‌న్మ‌నిచ్చింది. క్రిస్మస్ శుభదినాన తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ చిరంజీవి సంబరపడిపోతున్నారు. chiranjeevi daughter,chiranjeevi daughter sreeja,chiranjeevi daughter sreeja kalyan dev,kalyan dev sreeja,kalyan dev sreeja baby girl, telugu cinema,చిరంజీవి కూతురు,తాత అయిన చిరంజీవి,శ్రీజకు కూతురు,శ్రీజ కళ్యాణ్ దేవ్ దంపతులకు కూతురు,క్రిస్మస్ రోజు మెగా ఇంట ఆనందం చిరంజీవి తాత,తెలుగు సినిమా
కుటుంబంతో కళ్యాణ్ దేవ్

ఆ తర్వాత ఐదేళ్ల పాటు తండ్రి ద‌గ్గ‌రే ఉంది ఈ మెగా అమ్మాయి. 2016లో క‌ళ్యాణ్ దేవ్‌తో శ్రీ‌జ వివాహం జరిగింది. ఈ వివాహానికి సినీ ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా వ‌చ్చారు. అంగ‌రంగ వైభవంగా కూతురు పెళ్లి చేసాడు మెగాస్టార్. ఇప్పుడు త‌న‌కు తాత‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చినందుకు సంతోషిస్తున్నాడు ఈయ‌న‌. ఇప్పటికే శ్రీజ ఓ కూతురు ఉంది. ఇప్పుడు మరో కూతురుకు జన్మనిచ్చింది ఈ మెగా అమ్మాయి.

Chiranjeevi Daughter Sreeja, Kalyan Dev Belssed with Baby Girl.. చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన మరోసారి తాత అయ్యాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు పండంటి ఆడబిడ్డ జ‌న్మ‌నిచ్చింది. క్రిస్మస్ శుభదినాన తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ చిరంజీవి సంబరపడిపోతున్నారు. chiranjeevi daughter,chiranjeevi daughter sreeja,chiranjeevi daughter sreeja kalyan dev,kalyan dev sreeja,kalyan dev sreeja baby girl, telugu cinema,చిరంజీవి కూతురు,తాత అయిన చిరంజీవి,శ్రీజకు కూతురు,శ్రీజ కళ్యాణ్ దేవ్ దంపతులకు కూతురు,క్రిస్మస్ రోజు మెగా ఇంట ఆనందం చిరంజీవి తాత,తెలుగు సినిమా
భార్య శ్రీజతో కళ్యాణ్ దేవ్

ఏదేమైనా తమ ఇంట్లోకి మరో కొత్త ప్రాణాన్ని చూసి మెగా కుటుంబం ఇప్పుడు ఆనందంలో తేలిపోతుంది. మ‌రోవైపు త‌న కూతురును చూసి మురిసిపోతున్నాడు క‌ళ్యాణ్ దేవ్. ఈయ‌న ఈ ఏడాదే ‘విజేత’ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇప్పుడు పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రెండో సినిమా చేస్తున్నాడు. కూతురు పుట్టిన సంద‌ర్భంగా త‌న‌కు విజ‌యం కూడా తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ మెగా అల్లుడు. చూడాలిక ఏం జ‌రుగుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: December 25, 2018, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading