మా అత్త బంగారం.. మెగా కోడలు ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..

ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా భర్త రామ్ చరణ్, మామ అత్తలైన చిరంజీవి, సురేఖలతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

news18-telugu
Updated: January 17, 2020, 12:54 PM IST
మా అత్త బంగారం.. మెగా కోడలు ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు..
భార్య, కొడుకు, కోడలితో చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు... తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట్ చేరారు. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అందరు యువ హీరోలు హాజరయ్యారు. మరోవైపు చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంక్రాంతిని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి,ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోను ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Upasana Konidela interesting tweet on Shadnagar incident and shared chiranjeevi massage in Social media pk తెలుగు ఇండస్ట్రీలో ఉపాసనకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా క్రేజ్ ఉంది.. అలాగే సొంత ఇమేజ్ కూడా సంపాదించుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్. chiranjeevi,chiranjeevi disha issue,upasana disha issue,chiranjeevi upasana,Upasana Konidela,Upasana Konidela twitter,Upasana Konidela instagram,Upasana Konidela videos,Upasana Konidela you tube channel,Upasana Konidela shares a new video on her Instagram for her followers,Upasana konidela on work place,Upasana konidela be happy,Upasana konidela on woman,Upasana konidela news,Upasana konidela on woman empowermentupasana konidela,upasana,upasana konidela tweet on pm modi,upasana kamineni,upasana kamineni konidela,ram charan wife upasana konidela,upasana konidela pics,upasana konidela tweet,upasana konidela speech,upasana konidela photos,upasana konidela husband,upasana konidela on pm modi,upasana konidela interview,upasana konidela latest photos,upasana konidela and ram charan,upasana konidela latest images,ఉపాసన,ఉపాసన యూ ట్యూబ్ ఛానెల్,చిరంజీవి ఉపాసన,ఉపాసన షాద్‌నగర్ ఘటన,ఉపాసన న్యూస్,
అత్తా మామ చిరంజీవి,సురేఖలతో రామ్ చరణ్ ఉపాసన (File/Photo)


ఈ సందర్భంగా మామ చిరంజీవి, అత్తమ్మ సురేఖపై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తనకు అత్త (సురేఖ) ప్రతి విషయంలో ఎంతో సహాయ సహాకారాలు అందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మొత్తంగా ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను.. అలాంటి ఉమ్మడి కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించడం విశేషం.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు