HOME » NEWS » movies » CHIRANJEEVI DANCES AND SINGS WITH HIS GRANDDAUGHTER SHARES A VIDEO ON TWITTER SR

చిరంజీవి ఆట పాట.. మనవరాలితో కలిసి అదరగొట్టిన మెగాస్టార్..

ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి యమ యాక్టీవ్‌గా వుంటూ కనీసం రోజుకో పోస్ట్ చేస్తు అదరగొడుతున్నాడు.

news18-telugu
Updated: April 28, 2020, 10:48 AM IST
చిరంజీవి ఆట పాట.. మనవరాలితో కలిసి అదరగొట్టిన మెగాస్టార్..
మనవరాలితో చిరంజీవి సందడి Photo : Twitter
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' పేరుతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అది అలా ఉంటే ఆయన ఇటీవల సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఆయన రోజూ ఏదో ఓ పోస్ట్ చేస్తూ చాలా యాక్టివ్‌ ఉంటున్నాడు. ఆయన తన పోస్టుల్లో ఎక్కువుగా ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా, తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు. అందులో భాగంగా ఆయన తాజాగా ఓ పోస్ట్ చేశాడు. అందులో చిరంజీవి.. ఇటీవల కాలంలో ఓ పాటను బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని చెబుతూ.. తన సినిమా ఖైదీ నంబర్‌ 150 చిత్రంలోని 'మిమ్మీ మిమ్మీమి.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ' పాటను తను చాలా సార్లు విన్నానని తెలిపారు. ఈ పాటను పిల్లలు కూడా చాలా ఇష్టపడతున్నారని చెప్పిన చిరు.. ఆ పాటను తన మనవరాలు శ్రీజ చిన్న కుమార్తె నవిష్క చాలా ఇష్టపడుతుందంటూ దానికి సంబందించిన ఓ వీడియోను షేర్‌ చేశాడు. ఇక ఆ వీడియోను తన మనవరాలుతో పాటు చిరంజీవి ఆడుతూ పాడుతూ అలరించాడు.  ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ఆయన ఓ పక్క కొరటాల శివతో 'ఆచార్య' చేస్తూనే.. రెండు సినిమాలను ఓకే చేశాడు. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేయనున్నాడు చిరంజీవి. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈసినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమాను కూడా చిరంజీవి ఓకే చెప్పాడు. తాజాగా మెహార్ రమేష్‌తో మరో సినిమాను కూడా ఓకే అన్నట్లు సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: April 28, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading