CHIRANJEEVI CONGRATULATES DAUGHTER SUSHMITA KONIDELAS RAJENDRA PRASAD SENAPATHI MOVIE TA
Chiranjeevi : కూతురు సుస్మిత మూవీని చూసి మెచ్చుకున్న చిరంజీవి..
సుస్మితకు చిరంజీవి అభినందనలు (Twitter/Photo)
Chiranjeevi : కూతురు సుస్మిత మూవీని చూసి మెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు పెద్ద కూతురు సుస్మిత తన భర్త విష్ణుతో కలిసి ‘సేనాపతి’ మూవీని నిర్మించారు. ఈ మూవీని చూసి చిరు మెచ్చుకున్నారు.
Chiranjeevi : కూతురు సుస్మిత మూవీని చూసి మెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు పెద్ద కూతురు సుస్మిత గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్య సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. అందులో భాగంగా సుష్మిత తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ జీ5లో ఫామ్‌లో స్ట్రీమ్ అయ్యి పరవాలేదనిపించింది. ఇక ఆ వెబ్ సిరీస్ తర్వాత ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో భాగంగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘సేనాపతి’ మూవీని నిర్మించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోల్డ్ బ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి కూతురు సుస్మిత, తన భర్త విష్ణుతో కలిసి నిర్మించింది. ఈ సందర్భంగా చిరంజీవి ఈ సినిమాను మెచ్చుకుంటూ తన సోషల్ మీడియా వేదిక ఓ పోస్ట్ చేశారు.
రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన ‘సేనాపతి’ మూవీని చూశాను. దర్శకుడు పవన్ సాధినేని ఈ సినిమాను అనుక్షణం ఎంతో ఉత్కంఠ రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించారు. మంచి అభిరుచికి అద్దం పట్టే చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు సుస్మితా కొణిదెల, విష్ణులకు నా ప్రేమాభినందనలు. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ఒక వినూత్న పాత్రలో అద్భుతంగా నటించారు. తన నటనా ప్రతిభకి ఈ చిత్రం మెచ్చు తునక. ఈ ప్రయత్నం వెనక ఉన్న GoldBox Entairment టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు చిరంజీవి కూతురు సుస్మిత ‘శ్రీదేవి శోభన్ బాబు’ పేరుతో ఓ సినిమాను నిర్మించింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. అలనాటి జంట శోభన్ బాబు, శ్రీదేవి పేర్లతో ఈ సినిమా టైటిల్‌తో ఈ మూవీపై హైప్ క్రియేట్ చేసారు.
ఇక చిరంజీవి విషయానికొస్తే.. ఆయన హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు ఈయన ‘గాడ్ ఫాదర్’ మూవీతో పాటు ‘భోళా శంకర్’ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ మూవీ చేస్తున్నారు. మరోవైపు ఈయన యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని RRR నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.