Home /News /movies /

CHIRANJEEVI COMMENTS ON TOLLYWOOD DIRECTORS AT LAAL SINGH CHADDHA EVENT SLB

Chiranjeevi: తెలుగు దర్శకులకు చిరంజీవి చురకలు.. నేనూ బాధితుడినే అంటూ ఓపెన్

Photo Credit: Twitter

Photo Credit: Twitter

అమీర్ ఖాన్ (Amir Khan) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). ఈ చిత్రంలో అమీర్ ఖాన్ జోడీగా కరీనా కపూర్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరపగా.. ఈ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
బాలీవుడ్ (Bollywood) మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). ఈ చిత్రంలో అమీర్ ఖాన్ జోడీగా కరీనా కపూర్‌ నటిస్తోంది. హాలీవుడ్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నివాసంలో అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ప్రివ్యూ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రివ్యూ షోని చిరంజీవితో కలిసి అక్కినేని హీరోలు నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య (Naga Chaitanya), స్టార్‌ డైరెక్టర్లు రాజమౌళి (Rajamouli), సుకుమార్‌ (Sukumar) అమీర్ ఖాన్ లు చూశారు.

ఈ క్రమంలోనే ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఆదివారం (జులై 24) జరిగింది . అయితే ఈ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో భాగమైన చిరంజీవి.. టాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో అమీర్ ఖాన్‌ నటన ఎంతో గొప్పగా ఉంటుందని, అమీర్‌లా తమకు చేయాలని ఉన్నా కూడా పలు పరిధుల వల్ల చేయలేకపోతున్నామని చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై మెగాస్టార్ ఓపెన్ అయినట్లు స్పష్టమవుతోంది.

కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్‌లో అప్పటికప్పుడు డైలాగ్స్ ఇచ్చి చెప్పమనడం జరుగుతోందని, ఇది నటీనటులను చాలా ఇబ్బంది కలిగించే విషయమని చిరంజీవి అన్నారు. తనకు కూడా చాలా సార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని అన్నారు. స్క్రిప్ట్‌ విషయంలో డైరెక్టర్లు బాగా కష్ట పడాలి. రెడీ చేసిన ఆ స్క్రిప్ట్‌ గురించి మిగతా టెక్నిషియన్స్‌కు కూడా ముందుగానే తెలిస్తే వారు పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. రిజల్ట్ కూడా వేరేలా వస్తుంది. అదే సినిమాపై ప్రభావం చూపిస్తుంది అని చిరంజీవి పేర్కొన్నారు.

సెట్స్ మీదకొచ్చాక అప్పటికప్పుడు డైలాగ్‌లు చెప్పి చేయించడంతో అంతగా ఇన్వాల్వ్‌మెంట్‌ ఉండదని చెప్పిన చిరు.. అందుకే వర్క్‌షాప్‌లు నిర్వహించాలని అన్నారు. అలా అయితేనే డైలాగ్‌ గుర్తుపెట్టుకోవండపై మనసు పెట్టకుండా కేవలం నటనపైనే మనసు పెట్టి చేసే అవకాశం ఉంటుందని మెగాస్టార్ చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Chiranjeevi, Laal Singh Chaddha, Naga Chaitanya

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు