హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : ఎందరో త్యాగాలు చేశారు.. కార్మికులకు అండగా ఉంటాను.. : చిరంజీవి..

Chiranjeevi : ఎందరో త్యాగాలు చేశారు.. కార్మికులకు అండగా ఉంటాను.. : చిరంజీవి..

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi : హైదరాబాద్‌లోని కోట్ల విజయ్‌ భాస్కర్‌ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి (Chiranjeevi).. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు.

  మేడే సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సినీ కార్మికోత్సవానికి (Chiranjeevi) చిరంజీవి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని కోట్ల విజయ్‌ భాస్కర్‌ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి (Chiranjeevi).. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటిసారి తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని.. అమెరికా వెళ్లాల్సి ఉన్నా.. ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చానని.. అమెరికా ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ ఇలాంటి పండుగలకు ఒక భరోసా ఇచ్చేలా మీతో పాటు నేనూ ఓ కార్మికుడినై వచ్చానని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ బయట పనిచేసే కార్మికులకు నిర్దిష్ట సమయం, వాతావరణ, పని ప్రదేశం ఉంటుంది.. కానీ సినీ కార్మికులకు అలాంటి సమయాలు, వాతావరణం లాంటివి వంటివి ఉండవని.. రాత్రిపగలూ తేడా లేకుండా పనిచేస్తుంటారని.. అత్యంత కష్టపడేవాళ్లు సినీ కార్మికులనీ, వారి త్యాగాలు గొప్పవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహారణలు ఇచ్చారు. సినిమా షూటింగ్‌ సందర్భంగా కారు ప్రమాదం జరిగి నూతన ప్రసాద్‌ గారి నడుముకు తీవ్రగాయమైందని.. అయినా ఆయన సినిమా ఆగిపోకూడదని వచ్చి షూటింగ్ చేశారంటూ తెలిపారు. డైరెక్టర్ KB తిలక్‌ నటుడిగా పెళ్లికొడుకు వేషంలో ఉండగా.. అప్పుడే భార్య చనిపోయిందని ఫోన్‌ వచ్చిందని.. అయితే తన వల్ల షూటింగ్‌ ఆగిపోకూడదని నిర్మాతకు నష్టం వస్తుందని భావించిన ఆయన.. బాధను దిగమింగుకొని ఆ రోజు షూటింగ్ చేశారు. ఇవన్నీ వాళ్లు సినిమాల కోసం చేసిన త్యాగాలు అంటూ పేర్కోన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ తాను ఎప్పుడూ కార్మికులకు అండగా ఉంటానని తెలిపారు.

  ఇక చిరంజీవి (Chiranjeevi) న‌టించిన సినిమాల విషయానికి వస్తే.. 'ఆచార్య' (Acharya). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది.

  Keerthy Suresh : కీర్తి సురేష్ సర్కారు వారి పాట డబ్బింగ్ పూర్తి.. ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ అంటూ ట్వీట్..

  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్ద పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించారు దర్శక నిర్మాతలు. ఇక రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్

  ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chiranjeevi, Tollywood news

  ఉత్తమ కథలు