Chiranjeevi : టిక్కెట్ల విషయంలో జగన్ ప్రభుత్వంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు... పోస్ట్ వైరల్..

AP CM Jagan and Chiranjeevi Photo : Twitter

Chiranjeevi : ఏపీ టిక్కెట్ల విషయంలో జగన్ ప్రభుత్వంపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని చిరంజీవి జగన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఓ నోట్‌ను వదిలారు.

 • Share this:
  ఏపీ సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేయాలని (Chiranjeevi) చిరంజీవి, జగన్ (CM Jagan ) ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియాలో అకౌంట్ ట్వీట్టర్‌లో ఓ నోట్‌ను వదిలారు. ‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’’ అని చిరంజీవి తన ట్విట్‌లో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్స్ రకకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయం పై ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అటు సినీ ఇండస్ట్రీ, ఇటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. కాగా ఇటీవల ఆచార్య ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.


  అది అలా ఉంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది. భోళా శంకర్ తాజాగా షూటింగ్‌ను కూడా మొదలు పెట్టింది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలై తెగ హల్ చల్ చేసింది. ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

  అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ (Shruti Haasan) ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్' చేస్తోంది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ గోపీచంద్ సినిమా‌లోను హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమాకు 'వాల్తేరు వీర్రాజు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్.

  Bigg Boss 5 Telugu - Maanas : కెప్టెన్ కూల్ మానస్.. బిగ్‌బాస్‌లో టాప్ 5కి మరింత చేరువ..

  ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మలయాళీ హిట్ సినిమా లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

  మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

  ఇక అది అలా ఉంటే చిరంజీవి మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు వెంకీ కుడుముదల దర్శకత్వంలో ఓ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకీ కుడుములు ఇటీవల నితిన్‌తో భీష్మ అనే సినిమా తీసి విజయం అందుకున్నారు. చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారట. దీనికి సంబంధించిన త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. విశేషం ఏమంటే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుందని సోషల్ మీడియాలో టాక్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  ఇక కొరటాల శివ ఆచార్య విషయానికి వస్తే.. చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: