మహేష్‌ బాబు ఫంక్షన్‌కు చిరంజీవి... గెస్ట్ అవసరం లేదన్న బన్నీ

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళుతున్నారు. అయితే ఇదే సమయంలో జరగనున్న' అల వైకుంఠపురములో' ఈవెంట్‌కు మాత్రం గెస్ట్ ఎవరూ రావడం లేదు.

news18-telugu
Updated: January 5, 2020, 10:29 AM IST
మహేష్‌ బాబు ఫంక్షన్‌కు చిరంజీవి... గెస్ట్ అవసరం లేదన్న బన్నీ
మహేష్, చిరంజీవి, అల్లు అర్జున్
  • Share this:
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. అయితే
మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళుతున్నారు. అయితే ఇదే సమయంలో జరగనున్న' అల వైకుంఠపురములో' ఈవెంట్‌కు మాత్రం గెస్ట్ ఎవరూ రావడం లేదు. టాలీవుడ్‌‌లో చిరంజీవిని మించిన గెస్ట్ లేని కారణంగా ఎవరూ వద్దని బన్నీ చెప్పాడట. చిరంజీవిపై ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో మరే గెస్ట్‌ను తన సినిమా కోసం ఆహ్వానించవద్దని దర్శక, నిర్మాతలకు అల్లు అర్జున్ సూచించినట్లు సమాచారం. దీంతో మరెవరినైనా పిలిస్తే, చిరంజీవి స్థాయి తగ్గినట్లవుతుందని బన్నీ అనుకున్నాడట. దీంతో ఎవరినీ పిలవకుండానే కార్యక్రమం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

బన్నీ హీరోగా వస్తున్న కొత్త సినిమా 'అల వైకుంఠపురములో...' కూడా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ‘అల వైకుంఠపురములో..’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరక్షన్ ‘జులాయి’ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’. పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు

First published: January 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు