Home /News /movies /

CHIRANJEEVI CHANGE TWITTER PROFILE PIC SB

Chirnajeevi: ప్రొఫైల్ పిక్ మార్చేసిన చిరంజీవి.. పాత ఫోటో పెట్టిన మెగాస్టార్..!

ఆ కళ్ళను హైలైట్ చేస్తూ వుంది చిరు కొత్త ప్రొఫైల్ పిక్. ఈ పిక్‌ను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా చిరు లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

    సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ ప్రొఫషనల్ లైఫ్‌తో పాటు పర్సలన్ లైఫ్‌కు సంబంధించి ఫోటోలను.. విషయాల్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి చిరు కూడా అన్ని విషయాలపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా చిరు తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చేశారు.

    తాజాగా ఇప్పుడు చిరంజీవి  కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ పిక్ మార్చారు. తాను ఇరవైలలో వున్నప్పటి ఫొటోని చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టారు. ఇప్పుడు ఈ పిక్ తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అంటేనే.. ఆయనలో కళ్ళు సెంటరాఫ్ ఎట్రాక్షన్. ఆ కళ్ళను హైలైట్ చేస్తూ వుంది చిరు కొత్త ప్రొఫైల్ పిక్. సైడ్ యాంగిల్‌లో వున్నా, చిరంజీవి డైనమిక్ లుక్.. అందర్నీ కట్టిపడేస్తోంది. ఇక చిరు ఫోటో చూసిన అభిమానులు ఈ లుక్కు చూసి ఫిదా అవుతున్నారు.



    మొన్నీమధ్యనే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాకి సంబంధించి తన ప్రొఫైల్ పిక్ మార్చారు.. అప్పట్లో ఆ విషయం హాట్ టాపిక్ అయ్యింది. యుద్ధం మొదలైంది.. అనే సంకేతాలిచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రొఫైల్ పిక్ మార్చారంటూ జనసైనికులు అప్పట్లో చెప్పుకున్నారు.  పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌ని ఎప్పుడూ సినిమాలకు సంబంధించిన విషయాల కోసం వాడలేదు. కేవలం రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి మాత్రమే ఆయన తన ట్విట్టర్‌ని వాడుతుంటారు. అడపా దడపా ప్రముఖుల్ని అభినందించేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకూ వాడుతుంటారు.

    ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా తర్వాత చిరు గాడ్ ఫాదర్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో ఓపాత్రలో కనిపిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మళయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌కు రీమేక్‌గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపంచనున్నాడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chiranjeevi, Megastar Chiranjeevi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు