జబర్దస్త్‌గా చిరంజీవి కొత్త ఇల్లు.. భారీ హంగులతో

మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: November 22, 2019, 10:03 AM IST
జబర్దస్త్‌గా చిరంజీవి కొత్త ఇల్లు.. భారీ హంగులతో
Twitter
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణం ఇంకొద్ది రోజుల్లో పూర్తికానుంది. చిరంజీవి ఎంతో ఇష్టపడి ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా కొత్త ఇంటిని మరిన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదే విషయాన్ని ఆ భవంతికి డిజైన్ అండ్ ప్లానింగ్ చేసిన తహిలియానీ హోమ్స్ నిర్వాహకుల్లో ఒకరైన జహన్ తహిలియానీ చెప్పారు. ఈ కొత్త ఇంటిని దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తూ.. సకల సదుపాయాలతో పాటు, అనేక ఖరీదైన వస్తువులను ఇంట్లో సమకూర్చనున్నారట. ముఖ్యంగా బెడ్ రూమ్‌ను నగలు, ఆభరణాల తయారీలో వాడే పచ్చరాళ్లను ఉపయోగించి పెద్దగా రూపొందించారట. దీనికి తోడు ఇంట్లో ప్రత్యేకంగా ఓ పెద్ద పూజగదిని కూడా నిర్మించారట. మరోవైపు రామ్ చరణ్, ఉపాసన దగ్గరుండి పనుల్నీ పర్యవేక్షిస్తున్నారని, హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టేలా ఈ కొత్త ఇల్లు ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు ప్రారంభోత్సవానికి తెలుగు ఇండస్ట్రీతో పాటు, అటు తమిళ, హిందీ ఇండస్ట్రీలో ప్రముఖుల్నీ పిలువనున్నారని సమాచారం.

Chiranjeevi build a new house in hyderabad very lavishly,Chiranjeevi build a new house,Chiranjeevi build house,Chiranjeevi house,Chiranjeevi build a new house features,చిరంజీవి కొత్త ఇల్లు,చిరంజీవి న్యూ హౌజ్,
చిరంజీవి కుటుంబం Photo : Twitter


First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>