CHIRANJEEVI BROTHER IN LAW ALLU ARAVIND FAILED FOR AHA OTT PLATFORM TA
ఆ విషయంలో అల్లు అరవింద్ ఫెయిల్ అయ్యాడా..
అల్లు అరవింద్ ఫైల్ ఫోటో
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా అల్లు అరవింద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడంలో చిరు స్వయంకృషితో పాటు అల్లు అరవింద్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతుంటారు. ఇలాంటి రికార్డు ఉన్న అల్లు అరవింద్ ఓ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా అల్లు అరవింద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడంలో చిరు స్వయంకృషితో పాటు అల్లు అరవింద్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతుంటారు. ఈయన నిర్మాతగా చిరంజీవితో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల హీరోలతో సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది. అలాంటి రికార్డు ఉన్న అల్లు అరవింద్.. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ విషయంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ప్రస్తుతం కరోనా తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం లాక్ డౌన్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. దాంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఏరోస్ వంటి ఓటీటీ సంస్థలతే.. ముందుగా తమ ఫ్లాట్‌ఫామ్ అలవాటు చేయడానికి రెండు నెలలు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇచ్చేసింది. మరోవైపు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ 5 వంటి పెద్ద సంస్థలు కూడా తమ కష్టమర్స్కు ఒక నెల ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాయి. వీళ్లందరు రోజుకో కొత్త కంటెంటెను రిలీజ్ చేస్తున్నారు. కానీ అల్లు అరవింద్ మాత్రం అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఆహా’ యాప్ మాత్రం కరోనా సమయాన్ని క్యాష్ చేసుకోలేకపోతుంది. అందుకు కారణంగా ముందు ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో సరైన ప్లాన్ లేకపోవడమే.
చిరంజీవి అల్లు అరవింద్
ఒక యాప్ లాంచ్ అవుతుంది అంటే అందులో కనీసం ఎంత లేదన్న 100 సినిమాలు. ఓ 50 వెబ్ సిరీస్‌లు ఉండేలా చూసుకోవడం ఇంపార్టెంట్. అలాంటివేమి లేకండా చాలా తక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రారంభమైన అల్లు అరవింద్ ‘ఆహా’లో పెద్ద కంటెంట్ మాత్రం లేదు. ఇందులో కేవలం తెలుగుకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. మిగతా ఫ్లాట్‌ఫామ్స్‌లో తెలుగులో పాటు హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ లభిస్తున్నాయి. ఒక వేళ హిందీ, ఇంగ్లీష్ కంటెంట్‌ను మనము తెలుగులో చూసుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ అల్లు అరవింద్ ‘ఆహా’లో మాత్రం ఇలాంటివేమి లేవు. పైగా సబ్స్క్రిప్షన్ కోసం రూ.350 అని చెబుతున్నారు. అమెజాన్, జీ 5, హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ఫ్లాట్ ఫామ్స్ ను తట్టుకొని నిలబడాలంటే కాస్త కష్టమే అంటున్నారు. మొత్తానికి సినిమాలు, వ్యాపారాల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉండే అల్లు అరవింద్.. ‘ఆహా’ అనే ఓటీటీ ఫ్లామ్‌ఫామ్ విషయంలో తప్పటడుగు వేసిందని అందరు చెప్పుకుంటున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.