Home /News /movies /

CHIRANJEEVI BOBBY MOVIE SHRUTI HAASAN MAY PAIR WITH MEGASTAR HERE ARE THE DETAILS TA

Chiranjeevi : బాబీ సినిమాలో చిరంజీవి సరసన బాలయ్య భామ.. త్వరలో అధికారిక ప్రకటన..

మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఒకప్పుడు యంగ్ ఏజ్‌లో చేస్తున్నట్టు వరుసగా సినిమాలను ఓకే చేస్తున్నారు. తాజాగా బాబీ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో బాలయ్య భామతో చిరంజీవి ఆడిపాడనున్నారు.

ఇంకా చదవండి ...
    మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఒకప్పుడు యంగ్ ఏజ్‌లో చేస్తున్నట్టు వరుసగా సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇప్పటికే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేసిన  సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య  చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. రామ్ చరణ్ మరో హీరోగా నటించారు. ఆచార్య మూవీని  ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. కానీ ఇప్పటికే ఓమైక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు థియేటర్స్‌ను క్లోజ్ చేసాయి. మరికొన్ని సగం ఆక్యుపెన్షీతో నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ఇప్పటికే రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌లతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. ఆ బాటలో ప్రభాస్ మూవీ ‘రాధే శ్యామ్’ కూడా ఓమైక్రాన్ నేపథ్యంలో పోస్ట్‌పోన్ అయింది.

    ఈ కోవలో చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సెట్స్‌పై ఉంది.

    Pushpa 20 Days Collections : అల్లు అర్జున్ ‘పుష్ప’ 20 రోజుల కలెక్షన్స్.. తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్..

    ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగ్‌లో ఫిబ్రవరిలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ లోపు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్ సినిమాను చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీ ఆల్మొస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది. ఇక బాబీతో సినిమా కొబ్బరికాయ కొట్టినా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. సంక్రాంతి నుంచి ఈ సినిమా షూటింగ్‌లో చిరంజీవి మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో  హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ (Shruti Haasan) ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

    చిరంజీవి సరసన శృతి హాసన్ (File/Photo)


    నిన్న మొన్నటి వరకు యంగ్ హీరోలతో ఆడిపాడిన శృతి హాసన్ ఇపుడు రూట్ ఛేంజ్ చేసింది. సీనియర్ కథానాయకులతో నటించడానికి రెడీ అంటోంది. ఈ కోవలో ఇప్పటికే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో ఈమె నటించడానికి ఓకే చెప్పింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఆ నిర్మాతలే చిరంజీవి, బాబీతో తెరకెక్కిస్తోన్న సినిమాలో శృతి హాసన్‌ను తీసుకున్నట్టు సమాచారం. రెండు సినిమాలకు కలిపి శృతి హాసన్‌కు దాదాపు రూ. 6 కోట్ల వరకు పారితోషకం ఇచ్చినట్టు సమాచారం.

    Akhanda 5 Weeks collections: ‘అఖండ’ 5 వారాల కలెక్షన్స్.. 35వ రోజు కూడా తగ్గని బాలయ్య జోరు..


    శృతి హాసన్..  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్.. చరణ్ .. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన శ్రుతి హాసన్, ఈ సారి మెగాస్టార్ సరసన నటించబోతుంది. ప్రస్తుతం  శృతి ప్రభాస్ సరసన 'సలార్' చేస్తోంది. ఇక చిరంజీవి, బాబీ సినిమాకు మంచి మాస్‌ మసాలా కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'వాల్తేరు వాసు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మరో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

    Chiranjeevi Bobby Movie Ravi Teja Will Play Crucial Importent Role Here Are the Details,Chiranjeevi - Ravi Teja : చిరంజీవి, బాబీ సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. త్వరలో అధికారిక ప్రకటన..,Chiranjeevi,Bobby,Ravi Teja,Chiranjeevi Ravi Teja,Chiranjeevi Bobby KS Ravindra Movie Crazy Update,Chiranjeevi Bobby Movie,Chiranjeevi again Dual Role in Bobby Movie,Chiranjeevi Twitter,Chiranjeevi Dual Role,Chiranjeevi Two Charecters,chiranjeevi,chiranjeevi double acting,chiranjeevi facebook,#HBDMegastarChiranjeevi,#chiranjeevi,tMegastar Chiranjeevi,Megastar Chiranjeevi birthday,Megastar Chiranjeevi movies,Megastar Chiranjeevi milestone movies,Megastar Chiranjeevi 150 movie,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi dual role in sye raa,chiranjeevi dual role,chiranjeevi dual role movies,megastar chiranjeevi dual role in 151 film,megastar chiranjeevi,dual role in 151 film,chiranjeevi movies,chiranjeevi in dual role,chiranjeevi playing dual role,megastar chiranjeevi dual role,chiru dual role,chiranjeevi dual role in sye raa movie,chiranjeevi dual role in koratala siva,nayanthara,ram charan koratala siva chiranjeevi,tollywood,telugu cinema,megastar,megastar chiranjeevi,chiru,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,చిరు,చిరంజీవి ద్విపాత్రాభినయం,చిరు డబుల్ రోల్,చిరు ద్విపాత్రభినయం,చిరంజీవి డబుల్ యాక్టింగ్,చిరంజీవి,కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,బాబీ మూవీలో,చిరంజీవి బర్త్ డే రోజున బాబీ సినిమా అప్‌డేట్,చిరంజీవి రవితేజ
    అలాగే బాబీ, చిరంజీవి సినిమాలో రవితేజ మరో హీరో


    ఇక కొరటాల శివ ఆచార్య విషయానికి వస్తే.. చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bobby, Chiranjeevi, Mythri Movie Makers, Shruti haasan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు