హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Ravi Teja : చిరంజీవి, బాబీ సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. త్వరలో అధికారిక ప్రకటన..

Chiranjeevi - Ravi Teja : చిరంజీవి, బాబీ సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. త్వరలో అధికారిక ప్రకటన..

అలాగే బాబీ, చిరంజీవి సినిమాలో రవితేజ మరో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.

అలాగే బాబీ, చిరంజీవి సినిమాలో రవితేజ మరో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.

Chiranjeevi - Ravi Teja : చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించడానికి ఓకే చెప్పాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

Chiranjeevi - Ravi Teja : చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించడానికి ఓకే చెప్పాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ కంప్లీట్ చేసారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఫష్ట్ షెడ్యూల్ ఊటీలో కంప్లీట్ చేసారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైయినట్టు సమాచరాం.  మరోవైపు చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్రలో అలరించనుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా రీసెంట్‌గా ప్రారంభమైంది.

ఇంకోవైపు బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ  చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బాబీ.. రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే కదా.  కథ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోకు అవకాశం ఉంది. ఆ పాత్రను రవితేజ వంటి ఎనర్జిటిక్ హీరోతో చేయిస్తే.. బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాబీ ఈ సినిమా కోసం కలిసాడట. పైగా చిరంజీవి హీరో కావడంతో రవితేజ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

NTR Jr - Koratala Siva : ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ ప్రారంభించనున్న కొరటాల శివ..


గతంలో రవితేజ.. చిరంజీవి హీరోగా నటించిన హిందీ మూవీ ‘ఆజ్ కా గూండారాజ్’ సినిమాలో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి, సౌందర్య హీరో,హీరోయిన్లుగా నటించిన ‘అన్నయ్య’ చిత్రంలో చిరు తమ్ముడు పాత్రలో నటించారు.

Chiranjeevi-Ravi Teja: మెగాస్టార్ టైటిల్ కొట్టేయాలని చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ..


ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఓ పాటలో రవితేజ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో అలరించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించారు. ఒకవేళ చిరంజీవి, బాబీ సినిమాలో రవితేజ నటిస్తే.. మెగాస్టార్, మాస్ మహారాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో చిత్రం అవుతోంది.

Chiranjeevi : ఆ ఫ్లాప్ దర్శకుడికి చిరంజీవి మరో ఛాన్స్ ఇస్తారా.. ? మెగాస్టార్ లిస్టులో మరో దర్శకుడు..


రవితేజ విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. హీరోయిన్స్‌గా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇంకోవైపు రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అన్ డ్యూటీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Balakrishna : ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ దూకుడు.. నట సింహా లిస్టులో పెరుగుతున్న దర్శకుల లిస్ట్..

ఈ సినిమాకు రవితేజ ఒక నిర్మాత వ్యవహరిస్తున్నారు. మరోవైపు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు ‘స్టూవర్ట్‌పురం దొంగ’ టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ను ప్యాన్ ఇండియా లెవల్లో చేస్తున్నారు. దాంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమా చేస్తున్నారు. మొత్తంగా చేతిలో అర డజను పైగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అన్నయ్య సినిమా కోసం గెస్ట్ రోల్ చేయడానికి రవితేజ ఓకే చెబుతారా లేదా అనేది చూడాది.

First published:

Tags: Acharya, Bhola Shankar, Bobby, Chiranjeevi, God father, Mythri Movie Makers, Ravi Teja

ఉత్తమ కథలు