Home /News /movies /

CHIRANJEEVI BOBBY MOVIE CRAZY UPDATE ON MEGASTAR BIRTHDAY HERE ARE THE DETAILS TA

Chiranjeevi - Bobby : చిరంజీవి, బాబీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మెగా బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

చిరంజీవి, బాబీ సినిమా బర్త్ డే ట్రీట్ (Twitter/Photo)

చిరంజీవి, బాబీ సినిమా బర్త్ డే ట్రీట్ (Twitter/Photo)

Chiranjeevi - Bobby : చిరంజీవి, బాబీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మెగా బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..

    Chiranjeevi - Bobby : చిరంజీవి, బాబీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మెగా బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా.. మరికొన్ని గంటల్లో చిరంజీవి 66వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఆ తర్వాత వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేసారు. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ‘భోళా శంకర్’, ‘ఆటో జానీ’,  ‘అన్నయ్య కోసం’ అనే టైటిల్ అనుకుంటున్నారు. మరోవైపు బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్.. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రి 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాక్షి సిన్హా పేరును పరిశీలిస్తున్నారు.

    ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో ఓ హార్బర్‌లో నడుచుకుంటూ చిరంజీవి వస్తోన్న పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం.



    ఈ సినిమాలో చాలా యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్టేనర్‌గా బాబీ (కే.యస్.రవీంద్ర) తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా చిరంజీవి ‘బిల్లా రంగా’, ‘ సింహపురి సింహం’, ‘రిక్షావోడు’, ‘స్నేహం కోసం’, ‘అందరివాడు’ సినిమాల్లో తండ్రీ కొడుకులుగా నటించారు. ఇపుడు మరోసారి తండ్రి కొడుకులుగా చిరంజీవి వెండితెరపై కనిపించనున్నారు. మొత్తంగా ఈ ఆది వారం రోజున బాబీ మెగాభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నాడో చూడాలి.

    ఇవి కూడా చదవండి

    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..


    Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఓనమ్ సెలబ్రేషన్స్.. సాంప్రదాయ చీరకట్టులో మెరిసిన కేరళ కుట్టీ..


    Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..


    K Raghavendra Rao - Ashwini Dutt: దర్శకుడు రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన‌ సినిమాలు ఇవే..


    Mohan Babu: ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసారు.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Director bobby, Mythri Movie Makers, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు