Chiranjeevi-Nagababu: మన అనుబంధం ఇలాగే కొనసాగాలంటూ నాగబాబుకు చిరు బర్త్ డే విషెష్..

చిరంజీవి,పవన్ కళ్యాణ్,నాగబాబు (Twitter/Photo)

Chiranjeevi-Nagababu | ఈ రోజు మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు నాగబాబు అన్నయ్య చిరంజీవి ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు.

  • Share this:
    Chiranjeevi-Nagababu | ఈ రోజు మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు నాగబాబు అన్నయ్య చిరంజీవి ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా చిరు తన ట్వీట్‌లో విధేయుడు, ఎమోషనల్ పర్సన్, మంచి మనుసున్న వ్యక్తే కాదు.. చాలా జోవియల్‌గా ఉండే పర్సన్ అయిన నా సోదరుడు నాగబాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలన్నారు. అంతేకాదు మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనగాలన్నారు. నీ ప్రతి బర్త్ డేకు అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. మంచి సందేశంతో పాటు తన ఇద్దరు సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసారు చిరు.


    ఇక నాగబాబు కూడా అన్నయ్య థాంక్స్ అన్నయ్య.. నేనెప్పుడూ నీ  వెంటే ఉంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు నాగబాబుకు అబ్బాయి వరుణ్ తేజ్‌, మేనల్లుడు సాయి తేజ్, బండ్ల గణేష్‌తో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు.









    నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. అదృష్టం కలిసిరాదు. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించాడు. కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రమే హిట్ అనిపించుకుంది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇంట్లో మెగా హిట్టు ఇచ్చే హీరోలు ఉన్న వారితో హిట్ సినిమాలు నిర్మించలేకపోవడం నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: