హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి తల్లి పాత్రలో బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ?

Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి తల్లి పాత్రలో బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ?

చిరంజీవి తల్లిగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ (Twitter/Photo)

చిరంజీవి తల్లిగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ (Twitter/Photo)

Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి తల్లి పాత్రలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ నటించనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత రీసెంట్‌గా ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్‌ను ఊటీలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మలయాళంలో మోహన్ ‌లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగస్టార్ చిరంజీవి తల్లి పాత్రలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ నటించబోతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నాడట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.  ఆ సంగతి పక్కనే పెడితే.. ఈ సినిమాకు సంబంధించి కథలో పూరీ జగన్నాథ్ ఇన్వాల్వ్ అయ్యారట. ఆయన సూచనలు, సలహాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో కథానాయకుడైన చిరంజీవి తల్లి పాత్రలో బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా అందరినీ ఆకట్టుకున్న గంగవ్వ నటించబోతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది.

Chiranjeevi Bigg Boss Contestant Gangavva Will Play Megastar Mother Charecter In God Father Movie,Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి తల్లి పాత్రలో బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ?,Chiranjeevi,Chiranjeevi Mother Gangavva,Bigg Boss Contestant Gangavva Play Chiranjeevi Mother Charecter,God Father Regular Shooting,Chiranjeevi As God Father,God Father Regular Shoot,God Father,Chiranjeevi Mohan Raja God Father update, Biju Menon in God Father , Chiranjeevi lucifer remake shoot starts, Chiranjeevi lucifer remake titled as godfather, Chiranjeevi news,Chiranjeevi lucifer remake update, Vidya balan, Anushka, Chiranjeevi acharya, Chiranjeevi movies, Chiranjeevi latest news, Chiranjeevi acharya news, Chiranjeevi Koratala siva acharya update, చిరంజీవి, లూసిఫర్,రమ్యకృష్ణ,చిరంజీవి చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ చెల్లెలు,చిరంజీవి రమ్యకృష్ణ,గాడ్ ఫాదర్ రెగ్యులర్ షూట్,చిరంజీవి తల్లి పాత్రలో గంగవ్వ,చిరు తల్లిగా బిగ్‌బాస్ కంటెస్టెంట్
చిరంజీవి తల్లిపాత్రలో గంగవ్వ (Twitter/Photo)

ఈ సినిమాలో ముందుగా విద్యాబాలన్‌ను చిరు చెల్లెలు పాత్ర కోసం అనుకున్నారు. కానీ ఫైనల్‌గా  ఈ చిత్రంలో రమ్యకృష్ణ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుసగా డిఫరెంట్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది.

Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

బాహుబలిలో శివగామిగా, రీసెంట్‌గా రిపబ్లిక్‌లో కూడా రమ్యకృష్ణ  అలరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు చిత్రాలున్నాయి. ‘లైగర్’, ’రంగమార్తాండ’,బంగార్రాజు సహా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇపుడు చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో రమ్యకృష్ణ .. చిరు చెల్లెలుగా కీలక పాత్రలో అలరించనుంది.

చిరంజీవి, రమ్యకృష్ణ (Twitter/Photo)

గతంలో రమ్యకృష్ణ .. చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘అల్లుడా మజాకా’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత చిరుకు చెల్లెలు పాత్రలో కనిపించనుంది.

Mohan Babu Vs Chiranjeevi : చిరంజీవి అలా చేసుండాల్సింది కాదు.. నేనైతే అలా ఎన్నటికీ చేయను .. చిరుపై మోహన్ బాబు వ్యాఖ్యలు..


గతంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది.  ఇపుడు చిరంజీవి హీరోగా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వస్తోన్న రెండో సినిమా.‘గాడ్ ఫాదర్’ సినిమాలో మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం.

First published:

Tags: Acharya movie, Bhola Shankar, Bigg Boss, Chiranjeevi, Gangavva, God father, Tollywood

ఉత్తమ కథలు