మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యతో పాటు మలయాళీ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి. ఇక చిరంజీవి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే..
ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. విద్యా బాలన్ తెలుగులో ఇప్పటికే బాలయ్య హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పైగా హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేశారట.
ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మరో సినిమా (Acharya) ఆచార్య. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. ఆచార్య ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.
ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమిళ్లో అజిత్ (Ajith) నటించిన యెన్నై అరిందాల్ను (Yennai Arindhaal) కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నారని టాక్. 2005లో వచ్చిన ఈసినిమాను గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. అందులో భాగంగా ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది దర్శకులతో చిరంజీవి చర్చలు ప్రారంభించారని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేయడానికి చిరంజీవి యువ దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumulu)తో చర్చించారని తెలుస్తోంది. ఈ విషయంలో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Tamannaah, Tollywood news