Home /News /movies /

CHIRANJEEVI BHOLA SHANKAR MOVIE NEW YEAR SWAG OF BHOLAA HERE ARE THE DETAILS TA

Chiranjeevi - Bhola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ నుంచి న్యూ ఇయర్ అప్టేట్.. ఫ్యాన్స్ కోసం అలా ప్లాన్ చేసిన మెగాస్టార్..

‘భోళా శంకర్’లో చిరంజీవి Twitter/Photo)

‘భోళా శంకర్’లో చిరంజీవి Twitter/Photo)

Chiranjeevi - Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా స్వాగ్ అంటూ ఓ పాటను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

    Chiranjeevi - Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. చిరంజీవి (Chiranjeevi ) విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది.  హీరోగా చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఈ విడుదల తేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఆచార్యతో పాటు గాడ్ ఫాదర్ మూవీతో పాటు ‘భోళా శంకర్’ (Bhola Shankar) సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

    ఈ మూవీ  తమిళ వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా  కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ భర్త పాత్రలో నాగ శౌర్య నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి భోళా స్వాగ్ అంటూ రేపు న్యూ ఇయర్ సందర్భంగా ఉదయం.. 9 గంటలకు ఓ అప్టేట్ ఇవ్వనున్నారు.



    ఇక చిరంజీవి చేస్తోన్న ‘ఆచార్య’ విషయానికొస్తే.. ఇందులో చిరుతో  పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    Year Ender 2021 : ఈ యేడాది టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు..

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో మూడు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. దాంతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు వెంకీ కుడుములతో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bhola Shankar, Chiranjeevi, Meher ramesh, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు