Chiranjeevi - Bhola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాకు ముహూర్తం ఖరారు.. అధికారిక ప్రకటన..

‘భోళా శంకర్’ సినిమాకు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Chiranjeevi - Bhola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాకు ముహూర్తం ఖరారు.. అంతేకాదు అధికారిక ప్రకటన కూడా చేశారు. 

  • Share this:
    Chiranjeevi - Bhola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాకు ముహూర్తం ఖరారు.. అంతేకాదు అధికారిక ప్రకటన కూడా చేశారు. మెగాస్టా ర్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. కాగా ఇటీవల ఆచార్య ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.

    అది అలా ఉంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉండగా.. వీటిలో ముందుగా బాబీ సినిమానే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను చిరంజీవి దీపావళి సందర్భంగా నవంబరు 6న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా మంచి మాస్‌ మసాలా కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'వాల్తేరు వాసు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్.  దేవిశ్రీ ప్రసాద్‌ సంగతీం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    దీంతో పాటు  ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ  తమిళ వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా  కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తమన్నా ఈ సినిమాలో చిరు సరసన నటించబోతున్నట్టు సమాచారం.



    ఇక చిరంజీవి చేస్తోన్న ‘ఆచార్య’ విషయానికొస్తే.. ఇందులో చిరుతో  పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు.

    Mani Sharma : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో ఓ ఇంటి వాడు కానున్న మహతి స్వర సాగర్..

    ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించబోతన్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: