Home /News /movies /

CHIRANJEEVI BHOLA SHANKAR MOVIE LATEST UPDATE SLB

Chiranjeevi: అనుమానాలకు ఫుల్‌స్టాప్ మెగా అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్..

Bhola Shankar

Bhola Shankar

Chiranjeevi Bhola Shankar: మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' సినిమా సెట్స్ మీదకొచ్చేందుకు రెడీ అవుతున్నారట చిరంజీవి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకోవడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ మెగా అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చారు ఈ చిత్ర దర్శకనిర్మాతలు.

ఇంకా చదవండి ...
కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). రీసెంట్‌గా ఆచార్య (Acharya) రూపంలో డిజాస్టర్ ఎదురైనా కూడా పర్ఫెక్ట్ లైనప్‌తో మంచి జోష్‌లో తన తదుపరి సినిమాల షూటింగ్స్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ (Mehar Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' (Bhola Shankar) సినిమా సెట్స్ మీదకొచ్చేందుకు రెడీ అవుతున్నారట చిరంజీవి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకోవడంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ మెగా అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చారు ఈ చిత్ర దర్శకనిర్మాతలు.

తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' సినిమాకి రీమేక్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా కథలో స్వల్పంగా మార్పులు చేర్పులు చేసుకున్నారట డైరెక్టర్ మెహర్ రమేశ్. కాగా ఇటీవల ఈ సినిమా సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ మధ్య చిత్రీకరించి తదుపరి షెడ్యూల్‌ కోసం కాస్త గ్యాప్ తీసుకోవడంతో రూమర్స్ షురూ అయ్యాయి. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ జూన్ నెల 21వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.

జూన్ నెల 21వ తేదీ నుంచి భోళా శంకర్ తదుపరి షెడ్యూల్ షురూ కానుందని తెలిపారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, ఇతర తారాగణంపై చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

క్రియేటివ్ కమర్సిల్స్ తో కలిసి ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భోళా శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మొత్తానికి తాజా అప్ డేట్‌తో భోళా శంకర్‌పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Bhola Shankar, Chiranjeevi, Tollywood

తదుపరి వార్తలు