హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Bhola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ టెస్ట్ షూట్ ప్రారంభించిన మెహర్ రమేష్..

Chiranjeevi - Bhola Shankar : చిరంజీవి ‘భోళా శంకర్’ టెస్ట్ షూట్ ప్రారంభించిన మెహర్ రమేష్..

‘భోళా శంకర్’ పై టెస్ట్ షూట్ నిర్వహించిన మెహర్ రమేష్ (Twitter/Photo)

‘భోళా శంకర్’ పై టెస్ట్ షూట్ నిర్వహించిన మెహర్ రమేష్ (Twitter/Photo)

Chiranjeevi - Bhola Shankar Test Shoot : చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమను ఈ నెల 11న పూజ. కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవిపై టెస్ట్ షూట్‌ నిర్వహించారు దర్శకుడు మెహర్ రమేష్.

  Chiranjeevi - Bhola Shankar Test Shoot : చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమను ఈ నెల 11న పూజ. కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చిరంజీవి, కీర్తి సురేష్‌లపై ఫోటో షూట్ చేసిన మెహర్ రమేష్.. తాజాగా చిరంజీవిపై ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన టెస్ట్ షూట్ చేసారు. మెగాస్టా ర్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆచార్య సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

  అది అలా ఉంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉండగా.. వీటిలో ముందుగా బాబీ సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు 'వాల్తేరు వాసు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్.  దేవిశ్రీ ప్రసాద్‌ సంగతీం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  దీంతో పాటు  ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ  తమిళ వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా  కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిరంజీవిపై మెహర్ రమేష్ టెస్ట్ షూట్ చేసారు.

  ఈ సినిమాకు మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తమన్నా ఈ సినిమాలో చిరు సరసన నటిస్తోంది. ఇక చిరంజీవి చేస్తోన్న ‘ఆచార్య’ విషయానికొస్తే.. ఇందులో చిరుతో  పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు.

  విడాకుల తర్వాత సమంతకు అరుదైన గౌరవం.. దక్షిణాదిన ఆ ఘనత అందకున్న తొలి హీరోయిన్‌గా రికార్డు..

  రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Bhola Shankar, Chiranjeevi, God Father Movie, Meher ramesh, Tollywood, Valteru Veerayya Movie

  ఉత్తమ కథలు