Chiranjeevi - Bellamkonda: చిరంజీవి రూట్లో బెల్లంకొండ శ్రీనివాస్ .. ఆ విషయంలో మెగాస్టార్ దిక్కు అంటున్న అల్లుడు శ్రీను వివరాల్లోకి వెళితే.. అప్పట్లో చిరంజీవి .. ఇప్పట్లో బెల్లంకొండకు మాత్రమే అది సాధ్యమైంది. అవును అప్పట్లో చిరంజీవి(Chiranjeevi) కూడా బాలీవుడ్ ఎంట్రీ కోసం కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో రాజశేఖర్ (Rajasekhar) హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అంకుశం’ (Ankusham) సినిమా హిందీ రీమేక్‌తో ‘ప్రతిబంధ్’(Pratibandh) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో రవిరాజా పినిశెట్టి (RaviRaja Pinisetty) డైరెక్ట్ చేశారు. బాలీవుడ్‌లో హీరోగా చిరంజీవితో పాటు.. దర్శకుడిగా రవిరాజా పినిశెట్టికి ఇదే ఫస్ట్ మూవీ. ఇక నిర్మాతగా అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది.
ఇపుడు చాలా యేళ్ల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas).. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఛత్రపతి’(Chatrapathi) హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతో వి.వి.వినాయక్ (VV Vinayak) దర్శకుడిగా హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..
హీరోగా బెల్లంకొండను టాలీవుడ్‌కు పరిచయం చేసిన వినాయక్.. ఇపుడు బాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పరిచయం చేయబోతున్నారు. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు దర్శకుడిగా వినాయక్‌కు ఇదే తొలి బాలీవుడ్(Bollywood) మూవీ. ఇక చిరంజీవి బాలీవుడ్‌లో తొలి సక్సెస్ అందుకున్నట్టే బెల్లంకొండ శ్రీనివాస్ .. బాలీవుడ్‌లో హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
ఇక నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh) కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. వీళ్లిద్దరు వాళ్లు నటించిన సూపర్ హిట్స్ ‘శివ’ ‘చంటి’ హిందీ రీమేక్స్ ‘శివ’ ‘అనారి’ సినిమాలతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ చిరంజీవి మాత్రం అప్పట్లో రాజశేఖర్ ‘అంకుశం’ హిందీ రీమేక్‌తో ఎంట్రీ ఇస్తే.. ఇప్పట్లో బెల్లంకొండ శ్రీనివాస్ .. ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ మూవీతో బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా అపుడు చిరంజీవి అలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. ఇపుడు బెల్లంకొండ ఇలా ఎంట్రీ ఇవ్వనున్నడన్న మాట.
ఇక చిరంజీవి విషయానికొస్తే.. ఈయన హీరోగా నటించిన ‘ఆచార్య’ వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.
Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..
ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bellamkonda Sreenivas, Bollywood news, Chiranjeevi, Tollywood