హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Bellamkonda: అప్పట్లో చిరంజీవి.. ఇప్పట్లో బెల్లంకొండకు మాత్రమే అది సాధ్యమైంది..

Chiranjeevi - Bellamkonda: అప్పట్లో చిరంజీవి.. ఇప్పట్లో బెల్లంకొండకు మాత్రమే అది సాధ్యమైంది..

చిరంజీవి,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (File/Photos)

చిరంజీవి,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (File/Photos)

Chiranjeevi - Bellamkonda: అప్పట్లో చిరంజీవి.. ఇప్పట్లో బెల్లంకొండకు మాత్రమే అది సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే..

Chiranjeevi - Bellamkonda: అప్పట్లో చిరంజీవి .. ఇప్పట్లో బెల్లంకొండకు మాత్రమే అది సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. అవును అప్పట్లో చిరంజీవి(Chiranjeevi) కూడా బాలీవుడ్ ఎంట్రీ కోసం కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో రాజశేఖర్ (Rajasekhar) హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ  ‘అంకుశం’ (Ankusham) సినిమా హిందీ రీమేక్‌తో ‘ప్రతిబంధ్’(Pratibandh) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో రవిరాజా పినిశెట్టి (RaviRaja Pinisetty) డైరెక్ట్ చేశారు. బాలీవుడ్‌లో హీరోగా చిరంజీవితో పాటు.. దర్శకుడిగా రవిరాజా పినిశెట్టికి ఇదే ఫస్ట్ మూవీ. ఇక నిర్మాతగా అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇపుడు చాలా యేళ్ల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas).. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఛత్రపతి’(Chatrapathi) హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతో వి.వి.వినాయక్ (VV Vinayak) దర్శకుడిగా హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనున్నారు. హీరోగా బెల్లంకొండను టాలీవుడ్‌కు పరిచయం చేసిన వినాయక్.. ఇపుడు బాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పరిచయం చేయబోతున్నారు. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు దర్శకుడిగా వినాయక్‌కు ఇదే తొలి బాలీవుడ్(Bollywood) మూవీ.

Chiranjeevi Bellamkonda Sai Sreenivas,Chiranjeevi Movies,Bellamkonda Sreenivas,Chiranjeevi Bollywood Entry,Bellakonda Sai Sreenivas Bollywood Debut Movie,Bellamkonda VV Vinayak,Chiranjeevi Twitter,Tollywood,Telugu cinema,చిరంజీవి,బెల్లంకొండ శ్రీనివాస్,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ,ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ,అంకుశం హిందీ రీమేక్ ప్రతిబంధ్‌తో చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ,మెగాస్టార్ చిరంజీవి,బెల్లంకొండ శ్రీనివాస్
చిరంజీవి,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (File/Photos)

ఇక చిరంజీవి బాలీవుడ్‌లో తొలి సక్సెస్ అందుకున్నట్టే బెల్లంకొండ శ్రీనివాస్ .. బాలీవుడ్‌లో హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇక నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh)  కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. వీళ్లిద్దరు వాళ్లు నటించిన సూపర్ హిట్స్ ‘శివ’ ‘చంటి’ హిందీ రీమేక్స్ ‘శివ’ ‘అనారి’  సినిమాలతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ చిరంజీవి మాత్రం  అప్పట్లో  రాజశేఖర్ ‘అంకుశం’ హిందీ రీమేక్‌తో ఎంట్రీ ఇస్తే.. ఇప్పట్లో బెల్లంకొండ శ్రీనివాస్ .. ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ మూవీతో బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా అపుడు చిరంజీవి అలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. ఇపుడు బెల్లంకొండ ఇలా ఎంట్రీ ఇవ్వనున్నడన్న మాట.

First published:

Tags: Bellamkonda Sreenivas, Bollywood news, Chatrapathi, Chiranjeevi, Tollywood

ఉత్తమ కథలు