అప్పటి అగ్ర దర్శకులతో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ రేర్ ఫోటో..

టాలీవుడ్ టాప్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌లతో దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, కే.రాఘవేంద్ర రావుతో పాటు నిర్మాత సి.అశ్వనీదత్ ఉన్న అపురూపమైన ఈ ఫోటో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: April 28, 2020, 4:11 PM IST
అప్పటి అగ్ర దర్శకులతో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ రేర్ ఫోటో..
చిరు, బాలయ్య,వెంకీలతో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి అశ్వనీదత్ (File/Photo)
  • Share this:
టాలీవుడ్ టాప్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌లతో దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, కే.రాఘవేంద్ర రావుతో పాటు నిర్మాత సి.అశ్వనీదత్ ఉన్న అపురూపమైన ఈ ఫోటో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఫోటో కోదండరామిరెడ్డి ఒకానొక పుట్టినరోజు సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోలో ఏ.కోదండరామిరెడ్డిని విష్ చేయడానికి చిరు, బాలయ్య, వెంకీలతో పాటు దర్శకేంద్రుడు, అశ్వనీదత్‌  విచ్చేసారు. ఇక ఏ.కోదండరామిరెడ్డి విషయానికొస్తే.. తెలుగులో అగ్ర హీరోలందరితో భారీ సినిమాలు తెరకెక్కించి వరుస విజయాలను అందుకున్నాడు. అంతేకాదు చిరంజీవి మెగాస్టార్ కావడంలో కోదండరామిరెడ్ద డైరెక్ట్ చేసిన సినిమాలే కీ రోల్ పోషించాయి. అటు బాలకృష్ణతో కూడా పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన ట్రాక్ రికార్డు కోదండరామిరెడ్డిది. మరోవైపు వెంకటేష్‌తో కూడా రెండు చిత్రాలను డైరెక్ట్ చేసారు కోదండరామిరెడ్డి. ఇక రాఘవేంద్రరావు, సి అశ్వనీదత్ కలయికలో వచ్చిన ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాను కోదండరామిరెడ్డి  డైరెక్ట్ చేసారు. అంతేకాదు దర్శకుడిగా ఆయన దాదాపు 90 పైగా చిత్రాలను డైరెక్ట్ చేసి సెంచరీకి కాస్త దూరంలో ఆగిపోయారు. ఇక అశ్వనీదత్ కూడా  ఈ ముగ్గురు హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్‌లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కించాడు.అందులో చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మిస్తే.. బాలకృష్ణతో అశ్వమేథం.. వెంకటేష్‌తో ‘సుభాష్ చంద్రబోస్’ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే కదా.
First published: April 28, 2020, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading