హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh - Chiranjeevi - Balakrishna - Nagarjuna : రూట్ ఛేంజ్ చేసిన సీనియర్ టాప్ హీరోలు.. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకరి తర్వాత మరొకరు..

Venkatesh - Chiranjeevi - Balakrishna - Nagarjuna : రూట్ ఛేంజ్ చేసిన సీనియర్ టాప్ హీరోలు.. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకరి తర్వాత మరొకరు..

చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ (Twitter/Photos)

చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ (Twitter/Photos)

Chiranjeevi - Venkatesh : రూట్ ఛేంజ్ చేసిన సీనియర్ టాప్ హీరోలు.. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకరి తర్వాత మరొకరు ఆ రూట్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

  Chiranjeevi - Venkatesh : రూట్ ఛేంజ్ చేసిన సీనియర్ టాప్ హీరోలు.. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఒకరి తర్వాత మరొకరు ఆ రూట్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అవును ఇప్పటి వరకు మన హీరోలు కేవలం సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే సత్తా చూపెట్టేవారు. ఇపుడు స్మాల్ స్క్రీన్ పై అదరగొడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాగార్జున,నాని వంటి హీరోలు బిగ్‌బాస్‌తో పాటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి ప్రోగ్రామ్స్‌తో అలరించారు. అటు చిరంజీవి కూడా చిన్ని తెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఇక నందమూరి నట సింహం బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్.. మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మీ, కుమారుడు మంచు విష్ణుతో కలిసి ఈ షోకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడులైంది. నవంబర్ 4న ఈ ఈ షో స్ట్రీమింగ్ కానుంది.

  తాజాగా వెంకటేష్.. తన అన్నయ్య అబ్బాయి రానాతో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు రానా నాయుడు అనే టైటిల్ పెట్టారు. ఇపుడు అదే బాటలో మెగాస్టార్ చిరంజీవి కూడా త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి షోతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

  Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh: చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్.. ఆ విధంగా బాక్సాఫీస్ రఫ్పాడించిన టాలీవుడ్ సీనియర్ హీరోస్..


  ప్రస్తుతం తెలుగు హీరోలు ట్రెండ్‌కు తగ్గట్టు తమను తాము అప్‌డేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాలకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్,హాట్ స్టార్, జీ 5 వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో గట్టి పోటీ ఏర్పడింది. దీంతో హీరోలు కూడా సినిమాలతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తమ లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నారు.ఈ కోవలో మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లో చాలా మంది నటీనటులు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నటిస్తున్నారు.

  Balakrishna Unstoppable Talk Show : చిరంజీవి గురించి మోహన్ బాబుకు బాలకృష్ణ ఆసక్తికర ప్రశ్న..


  అయితే నిన్న మొన్నటి వరకు బిగ్ స్టార్స్ మాత్రం ఎవరు దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్డ లేదు. మరోవైపు అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్ వంటి వాళ్లు వెబ్ సిరిస్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్ర నటుడు  అక్షయ్ కుమార్.. అమెజాన్ ప్రైమ్‌లో నటించడానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.ఇందులో నటించడానికి ఖిలాడీకి పెద్ద మొత్తంలోనే రూ. 100 కోట్ల వరకు పారితోషకం ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  Vekantesh Remakes: దృశ్యం 2 సహా వెంకటేష్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన ఈ సినిమా గురించి తెలుసా..

  తాజాగా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి కూడా వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జగపతి బాబు గ్యాంగ్ స్టర్స్‌ అనే వెబ్ సిరీస్ చేసాడు. అటు శ్రీకాంత్ కూడా ‘చదరంగం’ అనే వెబ్ సిరీస్‌లో అలరించాడు. వెంకటేష్, రానాలు కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.  ఇపుడు అదే బాటలో చిరంజీవి కూడా వెబ్  సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

  ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు చిరంజీవి కూతురు సుస్మిత తండ్రి కోసం మంచి వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న సినిమాలు చేస్తూనే ఈ వెబ్ సిరీస్‌ కోసం డేట్స్ కేటాయించే పనిలో ఉన్నారు. మరి మెగాస్టార్ వెబ్ సిరీస్ ఎంట్రీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Chiranjeevi, Nagarjuna Akkineni, Rana daggupati, Rana Naidu Web Series, Unstoppable NBK, Venkatesh

  ఉత్తమ కథలు