Chiranjeevi - Balakrishna - Pawan Kalyan : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ? ఎపుడో ఎక్కడో తెలుసా.. ? అవును ఈ ముగ్గురు హీరోలు ఒకే సారి ఒకే వేదికపై కనిపించనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. మరోవైపు చిరు.. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాలతో పాటు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఊటీలో రీసెంట్గా ప్రారంభమైంది. అటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు.
మరోవైపు బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈచిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది.
ఇంకోవైపు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. రానా మరో హీరోగా నటిస్తున్నారు. అహంకారానికి, ఆత్మ గౌరవానికి పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’ సినిమా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించనున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను దసరా రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
అదే విజయ దశమి రోజున.. పూజా కార్యక్రమాలతో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, చిరంజీవి, బాబీ సినిమాలను కూడా ప్రారంభోత్సవం చేయాలనే ఆలోచనలో ఉన్నారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు. ఒకే వేదికపై మూడు సినిమాలకు కొబ్బరికాయ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు ముగ్గురు హీరోలను ఒప్పించనట్టు సమాచారం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు కాబట్టి ఒకే వేదికపై రావడం పెద్ద విషయం కాదు. కానీ బాలకృష్ణను కూడా మెగా బ్రదర్స్ తో కలిసి ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్నారు మైత్రీ మూవీ మేకర్స్. మరి నిజంగానే మైత్రీ మూవీ మేకర్స్ దసరా రోజున ఈ ముగ్గురు హీరోలను ఒకే వేదికపై తీసుకొస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.