Chiranjeevi - Balakrishna - Pawan Kalyan: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో నట సింహా బాలకృష్ణ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

పవన్ కళ్యాణ్,బాలకృష్ణ,చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi - Balakrishna - Pawan Kalyan: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో నట సింహా బాలకృష్ణ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Chiranjeevi - Balakrishna - Pawan Kalyan: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో నట సింహా బాలకృష్ణ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..  అవును మెగాస్టార్  చిరంజీవి, ఆయన తమ్ముడు పవర్ స్టార్ జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో కలిసి నందమూరి నట సింహా బాలకృష్ణ ఉన్న ఫోటో మెగా, నందమూరి అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. చిరంజీవి విషయానికొస్తే.. మెగాస్టార్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నట వారసుడిగా పవన్ కళ్యాణ్ అన్నకు తగ్గ తమ్ముడిగా తనకంటూ పవర్ స్టార్ అనే ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా  ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇరు కుటుంబాలకు వారికంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

    మొత్తంగా ఈ ముగ్గురు హీరోలు కలిసి ఉన్న ఫోటోను ఇరువురు ఫ్యామిలీ హీరోలు తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు మెహర్ రమేష్, బాబీ సినిమాలు చేస్తున్నారు. ఇక బాలయ్య కూడా ‘అఖండ’ సినిమాతో పలకరించనున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని, ఆదిత్య 999, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్‌తో పాటు పలువురు దర్శకులతో నెక్ట్స్ సినిమాలు చేయనున్నారు. ఇటు పవన్ కళ్యాణ్.. కూడా ‘అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌తో పాటు హరీష్ శంకర్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పారు. మొత్తంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో బాలయ్య ఫోటో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: