చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ అందిరి కళ్లు అతని పైనే..

టాలీవుడ్ అగ్ర హీరోలైనా.. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ అందరు చూపు అతనిపైనే ఉంది. అంతేెకాదు ఈ ముగ్గురు హీరోలు.. అతన్ని తమ సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేయించడానికి రెడీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 23, 2020, 10:06 PM IST
చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ అందిరి కళ్లు అతని పైనే..
బాలకృష్ణ,చిరంజీవి,ఎన్టీఆర్ (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్ అగ్ర హీరోలైనా.. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ అందరు చూపు అతనిపైనే ఉంది. అంతేెకాదు ఈ ముగ్గురు హీరోలు.. అతన్ని తమ సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేయించడానికి రెడీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో చేయనున్నాడు. ఈ సినిమాను ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్‌ను అనుకుంటున్నారు. ఢిల్లీ రాజకీయల నేపథ్యంలో తెరకెక్కే పాన్ ఇండియా మూవీలో హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రలో బలమైన ప్రతినాయకుడి పాత్రకు అంతే ఇంపార్టెన్స్ ఉంది. అందుకే త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరు సంజయ్‌ దత్‌ను తమ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ మేరకు సంజయ్ దత్‌తో సంప్రదించారు కూడా. ఇప్పటికే సంజయ్ దత్.. యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కే.జీ.ఎఫ్ 2’ సినిమాలో అధిరగా నటిస్తోన్న సంగతి తెలిసిందే కదా.

KGF 2 movie Shooting stopped by Court and huge shock to Yash Fans pk అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని ఓ సినిమాలో త్రివిక్రమ్ రాసాడు. ఇది కెజియఫ్ సినిమాకు అక్షరాలా సరిపోతుంది. kgf 2,kgf chapter 2,kgf chapter 2 shooting,kgf chapter 2 movie shooting,kgf chapter 2 movie,kgf chapter 2 court case,kgf chapter 2 case,yash kgf chapter 2,kgf chapter 2 twitter,kgf chapter 2 sanjay dutt,telugu cinema,యశ్,కెజియఫ్ 2,కెజియఫ్ 2 షూటింగ్,కోర్టు కేసులో ఇరుక్కున్న కెజియఫ్ 2
సంజయ్ దత్ కేజీయఫ్ 2


మరోవైపు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో కూడా బలమైన విలన్ పాత్ర ఉందట.  ఆ క్యారెక్టర్ కోసం సంజయ్ దత్‌ను సంప్రదించారట. ఆల్రెడీ ఓ సారి  ఈ సినిమాలో డేట్స్ లేని కారణంగా నటించనని చెప్పిన సంజూ బాబా.. ఇపుడు బాలయ్య సినిమాలో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు చిరంజీవి కూడా మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో విలన్‌గా వివేక్ ఓబరాయ్ నటించాడు. తెలుగులో అదే పాత్రను చేయడానికి వివేక్ అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదట. అందుకే ఇపుడు వివేక్ ఓబరాయ్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను సంప్రదించారట. సంజయ్ దత్ కూడా ‘లూసీఫర్’ రీమేక్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపినట్టు సమాచారం. మొత్తంగా టాలీవుడ్ టాప్ హీరోలైనా.. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ ముగ్గురు కూడా తమ సినిమాల్లో బలమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ నటిస్తే బాగుండూ అని కోరుతున్నారు. మరి వీరి సినిమాల్లో సంజయ్ దత్ నటించేది లేనిది ఆయా చిత్రాలకు సంబంధించిన ప్రముఖులు స్పందిస్తే కానీ కన్ఫామ్ అని చెప్పలేము.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 23, 2020, 10:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading